షియోమీకి షాక్.. ఆ యాప్‌ను బ్యాన్ చేసిన గూగుల్.. ఎందుకంటే..?

-

మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీకి గట్టి షాక్ తగిలింది. గూగుల్ సంస్థ ఆ కంపెనీకి షాకిచ్చింది. షియోమీ ఫోన్లలో ఉండే క్విక్ యాప్స్ యాప్‌ను బ్యాన్ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీకి గట్టి షాక్ తగిలింది. గూగుల్ సంస్థ ఆ కంపెనీకి షాకిచ్చింది. షియోమీ ఫోన్లలో ఉండే క్విక్ యాప్స్ యాప్‌ను బ్యాన్ చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇప్పటికే సదరు యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అలాగే షియోమీ ఫోన్లలో ఆ యాప్‌ను వాడకూడదని వినియోగదారులను గూగుల్ హెచ్చరిస్తోంది.

google banned xiaomis quick apps app

షియోమీ ఫోన్లలో ఉండే క్విక్ యాప్స్ యాప్‌ను బ్యాన్ చేస్తున్నట్లు తెలిపిన గూగుల్.. అందుకు కారణాలను కూడా వెల్లడించింది. ఆ యాప్ వినియోగదారుల ఫోన్లలో ప్రతి ఒక్క సమాచారాన్ని సేకరిస్తుందని, ఆ యాప్‌కు ఏకంగా 55 పర్మిషన్లు ఉన్నాయని, దీంతో యూజర్‌కు చెందిన ప్రతి విషయాన్ని ఆ యాప్ ట్రాక్ చేస్తుందని, ఇది ఎంతో హానికరమని, యూజర్ డేటాకు సెక్యూరిటీని కల్పించాల్సింది పోయి, ఇలా డేటాను సేకరించడం ఎంత మాత్రం సబబు కాదని గూగుల్ తెలిపింది. అందుకనే ఆ యాప్‌ను తొలగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఇక ఈ విషయంపై పలువురు షియోమీ ఫోన్ల యూజర్లు కూడా ఆ కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయంపై షియోమీ స్పందిస్తుందో, లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news