మీ పిల్లలకు హోం వర్క్ లో గూగుల్ కొత్త యాప్ హెల్ప్…!

-

ఎప్పటికప్పుడు గూగుల్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త యాప్స్ ని ప్రవేశ పెడుతూనే వస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టి లో పెట్టుకుని తన వంతుగా గూగుల్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా తన వినియోగదారుల కోసం ఒక యాప్ ని తీసుకొచ్చింది గూగుల్. అది ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే… విద్యార్ధుల చదువుకి ఉపయోగపడే విధంగా, హోం వర్క్ లో తన వంతుగా సహాయం చేయడానికి సిద్దమైంది.

గూగుల్ తన సరికొత్త యాప్ బోలో యాప్ తో ముందుకు వచ్చింది. ఈ స్పీచ్‌‌ ఆధారిత యాప్‌‌ ఇక నుంచి బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో తన సేవలను అందిస్తుంది. అదే విధంగా బుక్స్ చదవడం కూడా ఇది నేర్పుతుంది. Bolo app ద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లీష్ భాషలను సులభంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ యాప్ లోని దియా అనే యానిమేటెడ్ కారక్టర్ పిల్లలకు కథలు చెప్పడం మాటలు నేర్పడం చేస్తుంది.

తల్లిదండ్రులకు కూడా సూచనలు చేసే విధంగా యాప్ ఉంటుంది. ఇందులోని వర్డ్ గేమ్స్ ఫన్నీగా ఉంటాయని సంస్థ చెప్తుంది. Bolo appతో పిల్లల ప్రోగ్రెస్ ను కూడా తల్లిదండ్రులు పర్యవేక్షించే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ఇంకో కీలక విషయం ఏంటీ అంటే ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండానే పని చేస్తుంది. ప్రత్యేకతలు చూస్తే స్పీచ్ రికగ్నేషన్, టెక్ట్స్ టు స్పీచ్ టెక్నాలజీ ఈ యాప్ లో చేర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news