లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. దీనితో తమ సన్నిహితులకు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వీడియో కాల్స్ చేస్తున్నారు. వీడియో కాల్ చేసి వారితో మాట్లాడుతున్నారు. దీనితో ఇప్పుడు వీడియో కాల్స్ కి డిమాండ్ ఏర్పడటం తో వాటిని అందించే యాప్స్ వినియోగదారుల కోసం కొత్త మార్గాలను ప్రవేశ పెడుతున్నాయి.
వీడియో కాల్ డిమాండ్ ని అర్ధం చేసుకున్న వాట్సాప్ 8 మందిని ఒకే సారి గ్రూప్ కాల్ లో జాయిన్ చేసే లా యాప్ ని అభివృద్ధి చేసింది. ఇక ఇప్పుడు గూగుల్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. జూమ్‌కు పోటీగా గూగుల్ తన కొత్త సర్వీస్ గూగుల్ మీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఉచిత వీడియో కాల్ సేవలను పొందే అవకాశం ఉంటుంది. దీనిపై గూగుల్ సీఈఓ సుదార్ పిచాయ్ మాట్లాడుతూ…
గూగుల్ మీట్ ప్లాటుఫారంలో రోజుకు 3 మిలియన్ల మంది వినియోగదారులను చేరుతున్నారని ఆయన వివరించారు. గూగుల్ మీట్ గూగుల్ జీ సూట్‌తో పాటు వస్తుందని ఆయన వివరించారు. గూగుల్ మీట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన వివరించారు. గూగుల్ మీట్ లో ప్రతిరోజూ 300 కోట్ల నిముషాలపాటు వీడియో సమావేశాలు జరుగుతున్నాయని గూగుల్ పేర్కొంది.