30% ఉద్యోగుల స్థానంలో ఏఐ.. లేఆఫ్స్ ప్రకటించిన ఐబీఎం

-

సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోత ఇంకా సాగుతూనే ఉన్నాయి. బడా బడా కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగుల నుంచి చిన్నస్థాయి వారి వరకు లేఆఫ్స్కు గురవ్వక తప్పడం లేదు. గతేడాది ఆర్థిక మాంద్యం భయంతో ఉద్యోగులను తొలగించిన కంపెనీలు ఇప్పుడు ఏఐ సాకుతో వారిని ఇంటికి పంపిస్తున్నారు. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం లేఆఫ్స్ ప్రకటించింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డివిజన్స్లో ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది.

కేవలం ఏడు నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఐబీఎం చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ జొనాథన్‌ అదాషేక్‌ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తు్న్నామని ప్రకటించారు. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత ఇవ్వలేదని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే రానున్న ఏళ్లలో చాలా ఉద్యోగాల స్థానంలో కృతిమ మేధను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాది కంపెనీ సీఈఓ అరవింద్‌ కృష్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news