ఐమొబైల్ పే యాప్‌ను లాంచ్ చేసిన ఐసీఐసీఐ.. ఏ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ అయినా వాడుకోవ‌చ్చు..

-

ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ దేశంలోనే తొలిసారిగా ఏ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ అయినా స‌రే వాడుకునే విధంగా ఐమొబైల్ పే పేరిట ఓ నూత‌న బ్యాంకింగ్ యాప్‌ను విడుద‌ల చేసింది. ఈ యాప్ స‌హాయంతో ఏ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ అయినా స‌రే యూపీఐ ద్వారా న‌గ‌దు చెల్లింపులు, ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఉచితంగా ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

icici bank launched imobile pay app

ప్ర‌స్తుతం ఈ యాప్ యూజ‌ర్ల‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్ర‌మే ల‌భిస్తోంది. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నాక అందులో క‌స్ట‌మ‌ర్లు ఏ బ్యాంక్ కు చెందిన అకౌంట్‌ను అయినా స‌రే లింక్ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. యూపీఐ ద్వారా డ‌బ్బులు పంపుకోవ‌చ్చు. బిల్లు చెల్లింపులు చేయ‌వ‌చ్చు. ఇక యూజ‌ర్ కు ఐసీఐసీఐ బ్యాంక్‌లో అకౌంట్ ఉండి ఈ యాప్‌ను వాడితే.. యూజ‌ర్ల కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవ‌రైనా ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్‌ను క‌లిగి ఉండే వారి యూపీఐ ఐడీల వివ‌రాలు యాప్‌లో యూజ‌ర్‌కు తెలుస్తాయి. దీంతో చాలా తేలిగ్గా యూజ‌ర్లు యూపీఐ ద్వారా డ‌బ్బు పంపుకోవ‌చ్చు. ఇంద‌కు గాను యాప్‌లో పే టు కాంటాక్ట్స్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

ఇక యాప్‌ను ఉప‌యోగించుకునే ఇత‌ర బ్యాంక్‌ల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్లు ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్‌ను ఓపెన్ చేయ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డులు, ప‌ర్స‌న‌ల్ లోన్ల‌ను కూడా త‌క్ష‌ణ‌మే పొంద‌వ‌చ్చు. అన్నింటినీ ఈ యాప్‌లోనే అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news