మాతృ భాషలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ !

-

ఇక మాతృభాషలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌ రాని వారి కోసం వాయిస్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ ఈ ఏడాది 36 మొబైల్‌ యాప్స్‌ను తొలగించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు, మాల్‌వేర్‌ ఎటాక్‌ అవుతున్నందుకు తొలగించింది. ఈ సంస్థ వాయిస్‌ ద్వారా ప్రజలు షాపింగ్‌ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, సులభతర పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ యాప్‌ను తెరిచి వినియోగదారులు తమ లోకల్‌ లాంగ్వేజ్‌లో కావాల్సిన వస్తువు పేరు చెబితే చాలు.. అప్పుడు సరఫరాదారుల నుంచి ఆప్షన్లు వస్తాయి.
ఇదివరకు మనం షాపింగ్‌ చేయాలంటే కాస్తో కూస్తో ఇంగ్లీష్‌పై పట్టు ఉన్న వారు చేయగలిగేవారు.

అయితే, ఇంగ్లీష్‌ రాని వారి దృష్టిలో పెట్టుకొని లోకల్‌ లాంగ్వేజ స్‌లో కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌ను పరిచయం చేస్తోంది నికీ అనే స్టార్టప్‌ సంస్థ. భాషా కారణంగా దాదాపు 60 శాతం మంది ఆన్‌లైన్‌ లో వస్తువులను కొనుగోలు చేయడం లేదని 2017లో అకౌంటింగ్‌ సంస్థలు నివేదికలు వెల్లడించాయి. స్థానిక భాషలు మాత్రమే వచ్చిన చాలా మందికి ఇంగ్లీష్‌ కీబోర్డులను ఉపయోగించడం ఒక పెద్ద సవాలుగా మారిందని, ఈ కారణంగా వారు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు దూరంగా ఉంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఈ సరికొత్త విధానంపై నికీ సిఈఓ, కోషౌండర్‌ సచిన్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ ‘ఆన్‌లైన్‌ షాపింగ్‌కు భాష అడ్డు కాకూడదనే లక్ష్యంతో ఈ సేవలను ప్రారంభించాం. అందరికీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.’’ అని అన్నారు. పెరుగుతున్న డిజిటల్‌ పేమెంట్లను కేవలం ఇంగ్లీష్‌ వచ్చిన వారికే కాకుండా మాతృభాషలో కూడా అందించాలని నికీ నిర్ణయించింది. తద్వారా, డిజిటల్‌ సేవల్లో అంతరాన్ని తగ్గించే ప్రక్రియ చేపట్టినట్లు జైస్వాల్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ సేవలను.. త్వరలోనే మరో 7 భాషల్లోకి విస్తరించాలని నికీ యోచిస్తోంది. 2022 మధ్య నాటికి మరో 10 రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు జైస్వాల్‌ చెప్పారు. ఈ యాప్‌ 95 శాతం కచ్చితత్వంతో వాయిస్‌ మెస్సేజ్‌లను లోకల్‌ లాంగ్వేజ్‌లో ప్రాసెస్‌ చేయగలదని ఆయన చెప్పారు.

మీరు నికీ యాప్‌ తెరిచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం లోకల్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడేటప్పుడు.. చాట్‌బాట్‌ మీకు సమాధానమిస్తుంది. మీరు అడుగుతున్న వస్తువుల లభ్యత, ధర వంటి వివరాలను వెంటనే ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో చెక్‌ చేస్తుంది. తద్వారా, మీరు సులభంగా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version