చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి తరలిరండి : ఎంపీ ఈటల

-

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రజలు, బీజేపీ కేడర్‌కు పిలుపునిచ్చారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను జనవరి 6న ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఈ మేరకు ఎంపీ ఈటల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నందున ఎయిర్ పోర్టును తలపించేలా కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసిందని, అందుకే ఈ ప్రాంత ప్రజలు సైతం పెద్దఎత్తున హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి విజయవంతం చేయాలన్నారు. చర్లపల్లితో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు కూడా దాదాపు రూ.1,500 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version