కేవలం రూ.39,300 కే ఐఫోన్ 11.. ఎలాగో తెలుసా..?

-

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్‌లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభమయ్యాయి.

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన నూతన ఐఫోన్లు.. ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్‌లను ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో ఐఫోన్ 11 రూ.64,900 ప్రారంభ ధరకు లభిస్తుండగా, ఐఫోన్ 11 ప్రొ రూ.99,900 ధరకు, 11ప్రొ మ్యాక్స్ రూ.1,09,900 ధరకు లభిస్తున్నాయి. అయితే ఈ ఫోన్లపై పలు డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో చాలా తక్కువ ధరలకే వీటిని కొనుగోలు చేయవచ్చు. మరి రాయితీలు పోను ఈ ఫోన్లను ఏ ధరకు కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఐఫోన్ 11 ఫోన్లపై హెచ్‌డీఎఫ్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలో ఆ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి తోడు ఈ ఫోన్లను స్మార్ట్‌బై ద్వారా 10ఎక్స్ ఆర్‌పీ బెనిఫిట్‌తో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ అందిస్తారు. ఈ క్రమంలో ఆయా డిస్కౌంట్లు పోను ఐఫోన్ 11ను రూ.39,300 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ 11 ప్రొను రూ.65,770 ధరకు, 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.74,470 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే పద్ధతిలో యాపిల్ వాచ్ సిరీస్ 5ను రూ.40,900కు కాకుండా రూ.24,600 ధరకే కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ ఇన్ఫినియా క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఐఫోన్ 11ను స్మార్ట్ బై ద్వారా కొంటే 10ఎక్స్ రివార్డ్ పాయింట్ బెనిఫిట్ కింద డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఫోన్‌ను బట్టి మారుతుంది. అందుకనే పైన చెప్పిన విధంగా భిన్నమైన ఐఫోన్ 11 ఫోన్లకు భిన్నంగా డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన డైనర్స్ బ్లాక్ క్రెడిట్ కార్డులు ఉన్నవారికి కూడా ఈ బెనిఫిట్ కింద డిస్కౌంట్ లభిస్తుంది. కానీ డిస్కౌంట్ పై విధంగా కాకుండా కొంచెం తక్కువగా వస్తుంది. ఈ క్రమంలో ఐఫోన్ 11ను వారు రూ.41,940కి, 11ప్రొను రూ.75,770కి, 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.84,470కి కొనుగోలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version