మోస్ట్ అవైటెడ్ ఐకూ 11 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇటీవలే లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇది ఒక సూపర్ లగ్జరీ ఫోన్.. ధర రూ. 50వేలు పైనే ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో ఫోన్ లాంచ్ అయింది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఐకూ 11 ప్రో ధర..
ఐకూ 11 ప్రోలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4,999 యువాన్లుగానూ అంటే సుమారు రూ.59,200గా ఉంది.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగానూ అంటే సుమారు రూ.65,000గా ఉంది.
టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా సుమారు రూ.70,000గా నిర్ణయించారు.
ఐజిల్ ఆఫ్ మ్యాన్ స్పెషల్ ఎడిషన్, లెజెండరీ ఎడిషన్, ట్రాక్ వెర్షన్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.
ఈ ఫోన్ మనదేశంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానుంది.
ఐకూ 11 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.78 అంగుళాల శాంసంగ్ ఈ6 అమోఎల్ఈడీ 2కే డిస్ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, హెచ్డీఆర్10+ సపోర్ట్ కూడా ఉంది.
ఆక్టాకోర్ 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఇందులో అందించారు.
512 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఈ ఫోన్లో ఉంది. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, యూఎస్బీ ఓటీజీ, ఎన్ఎఫ్సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్ , గెలీలియో, యూఎస్బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
3డీ అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్లో ఉంది.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 200W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీంతోపాటు 50W వైర్లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 213 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్ట్రెయిట్ లెన్స్ అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.