ఏఐ ముప్పు గురించి ముందే హెచ్చరించా.. మీరు పట్టించుకోలేదు : అవతార్‌ దర్శకుడు

-

ప్రస్తుతం ప్రపంచాన్ని.. ముఖ్యంగా టెక్ ఉద్యోగులను, నిపుణులను ఎక్కువగా భయపెడుతున్న విషయం కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్). ఏఐ వల్ల జరగబోయే ముప్పు గురించి ఇప్పటికే చాలా మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఏఐ ప్రమాదాలను తెచ్చిపెడుతుందని అవతార్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏఐ పరిణామాల గురించి 1984లోనే తాను సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ‘ద టెర్మినేటర్‌’ తెరకెక్కించానని కామెరూన్ తెలిపారు. ఆ సినిమా ఓ హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృత్రిమ మేధ గురించి జేమ్స్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐతో ‘ఆయుధీకరణ’ చేస్తే అది విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని చెప్పారు.

‘కృత్రిమ మేధ మానవ జాతి మనుగడపై ప్రభావం చూపిస్తుందని ఇటీవల కొందరు వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో ఏకీభవిస్తున్నాను. 1984లోనే నేను హెచ్చరించాను కానీ, మీరు పట్టించుకోలేదు.’ అంటూ తాను చిత్రీకరించిన ‘ద టెర్మినేటర్‌’ చిత్రాన్ని కామెరూన్ ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news