ట్విటర్‌ ఉద్యోగులకు షాక్.. మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించిన సంస్థ ..!

-

ఎలాన్ మస్క్ మరోసారి ట్విటర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించింది. సుమారు 200 మందికి లేఆఫ్స్‌ ప్రకటించింది. ట్విటర్ ను మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఉద్యోగుల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి.

ట్విటర్ ను అధీనంలోకి తీసుకున్న తర్వాత ఉన్నతాధికారుల‌పై వేటు వేసిన బిలియ‌నీర్ ఎలాన్ మ‌స్క్ ఆపై మాస్ లేఆఫ్స్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగుల‌ను తొల‌గించిన విషయం తెలిసిందే. 2022 నవంబ‌ర్‌లో ఇక లేఆఫ్స్ ఉండ‌వ‌ని చెప్పిన మస్క్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి కంపెనీలో భారీగా లేఆఫ్స్ చేప‌ట్టారు. ఈసారి ఇంజినీరింగ్, ప్రాడక్ట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు.

సుమారు ఈసారి 200 మంది ఉద్యోగులను తొలగించారు. ఇది ట్విటర్ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. కాగా, ఉద్యోగాలు పోయిన వారిలో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్‌పై పనిచేసే ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగం నుంచి తమను తొలగించినట్టు ఈమెయిల్స్ వచ్చాయని కొందరు ట్విటర్‌ ఉద్యోగులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version