జుకర్ బర్గ్​ నుంచి మరో సర్​ప్రైజ్..​ చాట్‌జీపీటీకి పోటీగా మెటా ఓపెన్‌-సోర్స్ AI

-

ప్రస్తుతం టెక్ రంగాన్ని కృత్రిమ మేధ (ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్) శాసిస్తోంది. ఇప్పటికే చాట్ బాట్, చాట్ జీపీటీ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి కూడా. అయితే ఇటీవలే థ్రెడ్స్​తో టెక్ రంగంలో ఓ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మెటా సంస్థ ఇప్పుడు ఏఐను తన ఆయుధంగా మలుచుకునే దిశగా ప్రయత్నాలు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో తన సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

తాజాగా ఏఐ రంగంలో.. ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI)ను ప్రారంభిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్‌ బార్డ్‌ చాట్‌ బాట్‌లకు పోటీగా మెటా దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ఉచితంగా వినియోగదారులకు అందించనున్నట్లు జుకర్‌ బర్గ్‌ తెలిపారు. ఈ ఏఐ మోడల్​ సాయంతో సాంకేతికత (లామా 2)ను మరింత అభివృద్ధి చేసి భవిష్యత్​లో పరిశోధన విభాగాలతో పాటు వాణిజ్య పరంగానూ ఉచితంగా వినియోగించుకునేందుకు ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్​ భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నామని జుకర్​బర్గ్​ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news