తెలంగాణ రాజకీయాలు త్రిముఖ పోరుగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో అధికార BRS పార్టీ, బీజేపీ మరియు కాంగ్రెస్ ల మధ్యనే ప్రధానమైన పోటీ ఉండనుంది. కాగా తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని బీసీ లను అవమానించేలా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. ఇకపై బీసీ లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తలసాని. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తామంటూ తలసాని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ లు అందరినీ ఏకం చేస్తామన్నారు. ముఖ్యంగా బీసీ లలో కులవృత్తులు చేసుకునే వారికి BRS ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పారు.
వీలైనంత త్వరలోనే బీసీ లకు ఏ విధంగా అండగా ఉంటుందో కార్యాచరణ ప్రకటించి , భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తమన్నారు.