ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సెక్యూరిటీ లోపాలు.. ప్రమాదంలో స్మార్ట్‌ఫోన్లు..

-

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? అందులో ఆండ్రాయిడ్ 8.0, 8.1, 9.0, 10.0 ఓఎస్‌లను ఉపయోగిస్తున్నారా..? అయితే మీ స్మార్ట్‌ఫోన్లకు ముప్పు ఉన్నట్లే.. ఎందుకంటే.. ఈ ఓఎస్‌లలో మూడు సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. దీంతో ఈ ఓఎస్‌లు ఉన్న ఫోన్లను వాడుతున్న వారికి గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది.

పైన తెలిపిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉన్న ఫోన్లలో రెండు క్లిష్టమైన సెక్యూరిటీ లోపాలతోపాటు మరో ప్రమాదకరమైన సెక్యూరిటీ లోపం కూడా ఉందని గూగుల్ తన సెక్యూరిటీ బులెటిన్‌లో తాజాగా వెల్లడించింది. ఇక ఆ ప్రమాదకరమైన సెక్యూరిటీ లోపానికి సీవీఈ-2019-2232 అనే కోడ్ నేమ్ పెట్టినట్లు గూగుల్ తెలిపింది. ఈ క్రమంలో సదరు సెక్యూరిటీ లోపాల వల్ల ఆండ్రాయిడ్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశంతోపాటు ఆ ఫోన్లు శాశ్వతంగా పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది. కనుక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే తమ ఫోన్లను డిసెంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఇక అప్‌డేట్ రాని వారు తమ ఫోన్ తయారీ కంపెనీ అందించే నూతన ఓఎస్ వెర్షన్‌కు ఫోన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version