8నిముషాల్లో మొబైల్ 100శాతం చార్జింగ్‌.. సూప‌ర్ టెక్నాల‌జీ తీసుకొచ్చిన షియోమీ

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఫోన్‌కు చార్జింగ్ పెట్టాలంటే క‌నీసం 40 నిముషాలైనా పెడితే ఒక 50శాతం చార్జింగ్ ఎక్కుతుంది. దీంతో మ‌న‌కు చాలా బోరింగ్ అనిపిస్తుంది ఆ టైమ్‌లో. ఇలాంటి వాటికి చెక్‌పెట్టి చాలా త్వ‌ర‌గా చార్జింగ్ పెట్టేందుకు అనుకూలంగా షియోమీ కంపెనీఓ సూప‌ర్ చార్జ‌ర్‌ను తీసుకొస్తోంది. అదేంటో చూద్దాం.

షియోమీ రెండు కొత్త చార్జింగ్ టెక్నాలజీలను లాంచ్ చేసింది. వీటిలో 200W హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్, 120W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీల‌ను తీసుకొచ్చింది. 200W హైపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్‌ల‌కు చార్జింగ్‌ను కేవలం 8 నిమిషాల్లోనే 100 నింపుతుంది.

అలాగే 120W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో ఇదే బ్యాటరీని 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చ‌ని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ చార్జింగ్ కెపాసిటీకి తగట్లు మార్పులు చేసిన ఎంఐ 10 ప్రోకు 10 శాతం చార్జింగ్ ఒక్క నిమిషంలో, 50 శాతం చార్జింగ్ 8 నిమిషాల్లో ఎక్క‌తుంది. ఒక‌వేళ 100 శాతం కావాల‌నుకుంటే క‌నీసం 19 నిమిషాలు ప‌డుతుంద‌ని కంపెనీ వివ‌రించింది. అయితే ఈ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్లలో ఎప్పుడు అందిస్తారో తెలియరాలేదు.