మొబైల్స్ తయారీదారు రియల్‌మి భారత్‌లో నూతనంగా స్మార్ట్‌టీవీలను లాంచ్ చేసింది. ఇవి 43, 32 ఇంచుల మోడల్స్‌లో వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా బెజెల్ లెస్ డిజైన్‌లో ఈ టీవీలను తీర్చిదిద్దారు. ఈ స్మార్ట్ టీవీలలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో తదితర అనేక యాప్స్‌ను ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా ఈ టీవీలు పనిచేస్తాయి.
అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్, రిమోట్పై యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, గూగుల్ అసిస్టెంట్లకు నేరుగా బటన్లు, 24 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ తదితర ఇతర ఫీచర్లను ఈ టీవీలలో అందిస్తున్నారు.
రియల్‌మి స్మార్ట్ టీవీ (43, 32 ఇంచ్) స్పెసిఫికేషన్లు…
* 43 ఇంచ్ టీవీ – 1920 × 1080 పిక్సల్స్ ఫుల్ హెచ్డీ స్క్రీన్ రిజల్యూషన్
* 32 ఇంచ్ టీవీ – 1366 × 768 పిక్సల్స్ హెచ్డీ స్క్రీన్ రిజల్యూషన్
* స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్ డిస్ప్లే మోడ్స్
* 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 మీడియాటెక్ ప్రాసెసర్
* 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 9.0
* బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, లైవ్ చానల్ ప్రీలోడెడ్ యాప్స్
* వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ 3 పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు
* 1 ఎస్పీడీఐఎఫ్ పోర్టు, డీవీబీ-టి2 పోర్టు, ఈథర్నెట్ పోర్టు, డాల్బీ ఆడియో
ధరలు…
రియల్‌మి 32 ఇంచుల హెచ్డీ రెడీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 ఉండగా.. 43 ఇంచుల ఫుల్ హెచ్డీ మోడల్ ధర రూ.21,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్లలో జూన్ 2వ తేదీ నుంచి ఈ టీవీలను విక్రయించనున్నారు. ఇక లాంచింగ్ సందర్భంగా ఈ టీవీలపై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఈ టీవీలను కొన్నవారికి యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. అలాగే 1+1 కింద ఏడాది అదనంగా వారంటీ లభిస్తుంది. ఈఎంఐ విధానంలోనూ ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు.