వాట్సాప్ నుండి అదిరే ఫీచర్.. వీడియో కాల్స్ స్క్రీన్‌ను షేర్ చేసేయచ్చు..!

-

వాట్సాప్ లో ఎన్నో ఫీచర్స్ రోజు రోజుకీ వస్తున్నాయి. వాట్సాప్ తో ఎంతో ఈజీగా మనం మెసేజెస్ ని పంపుకోవచ్చు. అలానే వీడియోలు, ఫొటోస్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో స్క్రీన్ షేరింగులో సహాయపడే ఫీచర్ కూడా వుంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మీ స్క్రీన్‌ని ఫోన్ లేదా పీసీ ని అందరు చూసేలా షేర్ చెయ్యచ్చు. సాధారణంగా ఆన్‌లైన్ మీటింగ్సు లో పిసి లేదా లాప్‌ట్యాప్‌ల లో స్క్రీన్ షేర్ చెయ్యచ్చు. వాట్సాప్ యాప్‌లోనూ అలాంటి ఆప్షన్ వుంది. ఆండ్రాయిడ్, ios పరికరాలలో వాట్సాప్ ని ఉపయోగించి స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు.

 

Whatsapp

వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్క్రీన్‌ను షేర్ చేసుకుంటే ఫోన్‌లోని సమాచారమంతా ఇతరులు వీక్షించేలా ఈ ఫీచర్ ఉపయోగ పడుతోంది. ఆఫీసు మీటింగులకు ఇదొక టూల్. అలానే మీరు చూస్తున్న కంటెంట్‌ను మీ బంధువులు, మిత్రులతో కూడా షేర్ చెయ్యచ్చు. స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌పై వాట్సాప్ యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుంది.

వాట్సాప్‌లోని ఈ ఫీచర్ ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లలో కనపడే స్క్రీన్ షేరింగ్ ఫీచర్ లానే ఉంటుంది. ముందుగా వీడియో కాల్ ఆప్షన్‌పై క్లిక్ చేసుకోవాలి. దీనిలో మీకు ‘షేర్’ అనేది కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ మొత్తం స్క్రీన్‌ను సులభంగా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ప్రస్తుతం యూజర్లకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ప్రస్తుతం ఒక్క వీడియో కాల్‌ లో 32 మంది వరకు మాట్లాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version