అతి తక్కువ ధరలో లభించే స్మార్ట్ టీవీలు ఇవే..

సమ్మర్ లో కొత్త టీవీలను కొనుగోలు చేయాలని అనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో లభించే టీవీలు మార్కెట్ లో అందుబాటులో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి చుద్దాము..

ఆన్ లైన్ ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు అద్భుతమైన కొనుగోలు ఆఫర్లను అందిస్తున్నది…35,390 లిస్టింగ్ ధరగా ఉన్న 4K ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీని రూ.24,499కే దక్కించుకునే అవకాశం వచ్చింది. అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్, డాల్బీ ఆడియో సపోర్ట్, ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సాన్‌సూయ్ 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే ఆండ్రాయిడ్‌ స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం ఈ ఆఫర్‌ ఉంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండే 20వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లతో ఈ టీవీ వస్తోంది..

ఈ టీవీ ఆఫర్లు..

ఈ టీవీ ధర 26శాతం డిస్కౌంట్‌తో రూ.25,999గా ఉంది. కాగా ప్రస్తుతం సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.24,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐసీసీఐ క్రెడిట్‌కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు దక్కుతుంది..

స్పెసిఫికేషన్లు:

43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4K (3840×2160 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంది. అంచులు లేని బెజిల్‌లెస్ డిజైన్‌తో వస్తోంది. HDR10 కంటెంట్‌కు ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. నెట్‍‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ లాంటి ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. యాప్స్‌, గేమ్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది.డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను కలిగి ఉంది. DTS స్టూడియో సౌండ్ ఫీచర్ ఉంటుంది. మూడు HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు ఉంటాయి. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. వాయిస్ సెర్చ్‌కు సపోర్ట్ చేసే రిమోట్ ఈ టీవీతో పాటు వస్తుంది.అలాగే సంవత్సరం వ్యారేంటి కూడా కలిగి ఉంది.