రోజుకు రూ.7కే స్పాటిఫై ప్రీమియం మినీ ప్లాన్‌.. ఇండియ‌న్ యూజర్ల‌కు ప్ర‌త్యేకం..

-

ప్ర‌ముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ స్పాటిఫై భార‌త్‌లోని త‌న యూజ‌ర్ల‌కు స‌రికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవ‌లం రూ.7 చెల్లించి స్పాటిఫై ప్రీమియం మినీ ప్లాన్‌ను పొంద‌వ‌చ్చు. స్పాటిఫైలో ఉన్న నెల‌వారీ, వార్షిక ప్లాన్ల‌లో ల‌భించే ప్ర‌యోజ‌నాలే ఇందులోనూ ల‌భిస్తాయి. కాక‌పోతే ఆఫ్‌లైన్ సాంగ్ డౌన్‌లోడ్స్‌పై ప‌రిమితి ఉంటుంది. కేవ‌లం 30 వ‌ర‌కు సాంగ్స్ ను మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

కాగా యూజ‌ర్లు త‌మ‌కు అవ‌స‌రం అనుకుంటే కేవ‌లం ఒక్క రోజే ఈ ప్లాన్‌ను వాడుకోవ‌చ్చు. త‌రువాత ఆపేయ‌వ‌చ్చు. దీంతోపాటు కేవ‌లం రూ.25 చెల్లించి వారం మొత్తం స్పాటిఫై ప్రీమియం మినీ ప్లాన్‌ను వాడుకోవ‌చ్చు. ఈ రెండు ప్లాన్ల‌లో యాడ్స్ రావు. అలాగే 160కేబీపీఎస్ క్వాలిటీతో సాంగ్స్ ను విన‌వ‌చ్చు.

ఇక స్పాటిఫై ప్రీమియం ప్లాన్ల‌లో రూ.119 నెల‌వారీ ప్లాన్ ల‌భిస్తోంది. ఇది కేవ‌లం ఒక యూజ‌ర్‌కు మాత్ర‌మే వ‌స్తుంది. 5 డివైస్‌ల‌లో ప్లాన్‌ను వాడుకోవ‌చ్చు. 10వేల వ‌ర‌కు పాట‌ల‌ను ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే నెల‌కు రూ.149 చెల్లిస్తే ఇద్ద‌రు యూజ‌ర్ల‌కు ప్లాన్ వ‌స్తుంది. నెల‌కు రూ.179 చెల్లిస్తే 6 మంది యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు. రూ.999 చెల్లిస్తే స్పాటిఫై ప్రీమియం ప్లాన్‌ను ఏడాది పాటు వాడుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version