శాంసంగ్ నియో QLED 8K టీవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మొదలైన వివరాలివే..!

-

మీరు మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్మార్ట్ టీవీ గురించి చూడాలి. శాంసంగ్ నియో QLED 8K TVలు QN900B (85-అంగుళాల), QN800B (65- మరియు 75-అంగుళాల), QN700B (65-అంగుళాల) మోడల్‌ల లో విడుదలయ్యాయి. మరి ఇక ఈ టీవీల వివరాలను చూస్తే.. రూ.3,24,990 నుండి ఈ టీవీలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లు, ఆన్ లైన్ స్టోర్స్ లో వీటిని మీరు కొనచ్చు. క్వాంటమ్ మినీ LED ల ద్వారా ఆధారితమై క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో తో ఈ టీవీ వస్తుంది. ఇది సాధారణ LED ల కంటే 40 రెట్లు చిన్నదని శాంసంగ్ పేర్కొంది. చక్కటి బ్రైట్నెస్ తో ఈ టీవీ వస్తుంది.

Neo QLED 8K టీవీ AI- ఆధారిత త్రీ-డైమెన్షనల్ డెప్త్‌ తో ఈ టీవీ ని రూపొందించారు. Neo QLED ఫీచర్స్ లలో ఐకంఫోర్ట్ మోడ్ ఉంది. సెన్సార్ల ఆధారంగా స్క్రీన్ యొక్క బ్రైట్ నెస్ మరియు టోన్‌ ని శాంసంగ్ నియో QLED 8K టీవీ కలిగి వుంది. సెన్సార్ల ఆధారంగా స్క్రీన్ యొక్క బ్రైట్ నెస్ మరియు టోన్‌ను అడ్జస్ట్ చేసుకోచ్చు. అలానే పరిసర కాంతి మారినప్పుడు స్క్రీన్ క్రమంగా కాంతి పరిమాణాన్ని తగ్గిస్తుంది.

స్క్రీన్‌ పై వీడియో కాలింగ్ లేదా వెబ్ కాన్ఫరెన్స్‌లను కూడా పొందవచ్చు. ఈ టీవీలకు స్మార్ట్ హబ్ ఫీచర్ కూడా వుంది. ఈ నియో QLED టీవీలు అంతర్నిర్మిత IoT హబ్‌ తో కూడా వస్తాయి. అన్ని రకాల స్మార్ట్ పరికరాలను ఈ టీవీతో ఆపరేట్ చెయ్యచ్చు. స్లిమ్‌ఫిట్ క్యామ్ తో పెద్ద టీవీ స్క్రీన్‌ పై వీడియో కాలింగ్ లేదా వెబ్ కాన్ఫరెన్స్‌లను కూడా పొందవచ్చు. స్మార్ట్ హబ్ ఫీచర్ కొత్తగా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news