ట్విటర్ ఉద్యోగులకు మస్క్ షాక్.. 3700 మందిపై వేటుకు ప్లానింగ్

-

ఎలాన్ మస్క్ ట్విటర్ ను టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. మస్క్ తీరుతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ట్విటర్ బాస్ లను తొలగించిన మస్క్.. మరికొంత మందిని తొలగించేందుకు రెడీ ఉన్నారని సమాచారం. ఏ ఒకరో పది మందో కాదు దాదాపు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారని బ్లూమ్‌బ‌ర్గ్ తాజా రిపోర్ట్ వెల్లడించింది.

ట్విటర్‌లో 3700 మంది ఉద్యోగుల‌పై మ‌స్క్ వేటు వేయ‌నున్నార‌ని ఈ నివేదిక బాంబు పేల్చింది. ఈ వారాంతంలోనే ఆయా ఉద్యోగుల‌కు స‌మాచారం అందించ‌నున్నార‌ని పేర్కొంది. మస్క్ ట్విటర్ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం లేఆఫ్స్ భారీగా ఉంటాయ‌నే వార్త‌ల‌ను ట్విట్ట‌ర్ బాస్ తోసిపుచ్చినా ఆయ‌న వ‌చ్చీ రాగానే సీఈవో, పాల‌సీ హెడ్‌ల‌ను తొల‌గించ‌డంతో జాబ్ క‌ట్స్‌పై భయాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

మ‌రోవైపు వ‌ర్క్ ఫ్రం హోం నుంచి తిరిగి కార్యాల‌యాల‌కు రావాల‌ని ట్విటర్ ఉద్యోగులను మ‌స్క్ కోరనున్నార‌ని చెబుతున్నారు. ఇక బ్లూటిక్ స‌హా ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు నెల‌కు 8 డాల‌ర్లు చార్జ్ చేయాల‌న్న మ‌స్క్ నిర్ణయంపై వ్య‌తిరేక‌త వెల్లువెత్తినా దీనిపై ట్విటర్ బాస్ వెన‌క్కిత‌గ్గ‌లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version