ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తేనుంది. యూజర్లు ఇకపై వాయిస్ ను రికార్డు చేసి దాన్ని మెసేజ్ రూపంలో ఇతరులకు నేరుగా పంపవచ్చు. ఈ ఫీచర్‌ను ట్విట్టర్ ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, జపాన్‌లలో టెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ట్విట్టర్‌లో యూజర్లు వాయిస్ మెసేజ్‌ను పంపాలంటే ఫోన్‌ను తీసి అందులో ఉన్న ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం అందులో డైరెక్ట్ మెసేజ్ ద్వారా వాయిస్‌ను రికార్డు చేసి పంపవచ్చు. మెసేజ్ ఆప్షన్‌లో కనిపించే వాయిస్ రికార్డింగ్ ఐకాన్‌పై ట్యాప్ చేసి అనంతరం వాయిస్‌ను రికార్డు చేయాలి. తరువాత మళ్లీ అదే ఐకాన్‌పై ట్యాప్ చేస్తే రికార్డింగ్ ఆగుతుంది. అనంతరం దాన్ని ప్లే చేసుకుని ఒకసారి వినవచ్చు. తరువాత దాన్ని నేరుగా పంపించుకోవచ్చు.
ఇక ఐఓఎస్ యూజర్లు వాయిస్ రికార్డింగ్ కోసం సదరు ఐకాన్‌ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. వాయిస్‌ను రికార్డు చేశాక ఐకాన్‌పై వేలిని తీసేయాలి. దీంతో వాయిస్ రికార్డు అవుతుంది. అనంతరం దాన్ని ఇతరులకు పంపించుకోవచ్చు.
ట్విట్టర్‌లో ఇప్పటికే వాయిస్ ట్వీట్స్ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. వాయిస్ మెసేజెస్ ఫీచర్ ద్వారా అందులో యూజర్లకు నేరుగా వాయిస్ మెసేజ్‌లను పంపించవచ్చు. దీన్ని ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. కనుక త్వరలోనే యూజర్లందరికీ లభిస్తుంది. ఇక కేవలం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపైనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ రికార్డెడ్ మెసేజ్‌లను వెబ్ యూజర్లు కూడా పొందవచ్చు.