ఇత‌రుల‌ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ల‌ను ఉప‌యోగిస్తున్నారా ? ఇక‌పై అలా కుద‌ర‌దు..!

-

ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ధిగాంచిన వీడియో స్ట్రీమింగ్ యాప్‌గా నెట్‌ఫ్లిక్స్ ఎంత‌గానో పేరు గాంచింది. ఎన్నో దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంది. మ‌న దేశంలోనూ ఈ యాప్‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే ప్ర‌పంచంలో చాలా మంది యూజ‌ర్లు త‌మ‌కు నెట్‌ఫ్లిక్స్ ఖాతా లేక‌పోయినా ఇత‌రుల నుంచి తీసుకుని దాన్ని ఉప‌యోగిస్తున్నార‌ని వెల్ల‌డైంది. ఇంట్లో ఇత‌ర కుటుంబ స‌భ్యులో, ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ల‌నో చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే ఇక‌పై అలా ఉప‌యోగించ‌డం కుద‌ర‌దు. అవును. నెట్‌ఫ్లిక్స్ ఇలా అకౌంట్ల‌ను షేర్ చేసుకుని ఉప‌యోగించ‌డాన్ని త్వ‌ర‌లో అడ్డుకోనుంది.

ఇక‌పై ఎవ‌రైనా స‌రే త‌మ ఇంట్లో నివ‌సించే వారితో కూడా బ‌య‌టి వ్య‌క్తుల‌తో నెట్‌ఫ్లిక్స్ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను షేర్ చేస్తే.. ఆ వివ‌రాల‌ను తీసుకుని నెట్‌ఫ్లిక్స్ ను ఓపెన్ చేసే వారికి ఒక వార్నింగ్ ముందుగా క‌నిపిస్తుంది. అయితే వార్నింగ్ వ‌చ్చినా వారు కొంత సేపు నెట్‌ఫ్లిక్స్‌ను చూడ‌వ‌చ్చు. కానీ కొంత సేప‌టికి వార్నింగ్ పోయి అకౌంట్ స‌స్పెండ్ అవుతుంది. దీంతో వారు నెట్‌ఫ్లిక్స్ ను చూడ‌లేరు. కేవ‌లం అకౌంట్ తీసుకున్న అస‌లు వినియోగ‌దారులు మాత్ర‌మే నెట్‌ఫ్లిక్స్ ను చూడ‌గ‌ల‌రు. ఇదే ఫీచ‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో త్వ‌ర‌లో అందుబాటులోకి తేనుంది.

ప్ర‌స్తుతం పైన తెలిపిన ఫీచ‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఎంపిక చేసిన కొద్ది మంది యూజ‌ర్ల‌తో టెస్ట్ చేస్తోంది. అందువ‌ల్ల అతి త్వ‌ర‌లోనే దీన్ని నెట్ ఫ్లిక్స్ ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. ఆ ఫీచ‌ర్‌ను గ‌న‌క అమ‌లు చేస్తే ఇక‌పై నెట్‌ఫ్లిక్స్‌ను అస‌లు యూజ‌ర్లు కాకుండా ఇత‌రులు వాడేందుకు అవ‌కాశం లేదు. అమెరికాలో 40 శాతం మంది యూజ‌ర్లు ఇత‌రుల నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ల‌నే వాడుతున్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది. అందువ‌ల్లే నెట్‌ఫ్లిక్స్ తాను కోల్పోతున్న ఆదాయాన్ని రాబ‌ట్టుకోవాల‌ని చెప్పి ఈ ఫీచ‌ర్‌ను అమ‌లు చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version