మీ ఫోన్ ని అమ్మేయాలనుకుంటున్నారా..? అయితే డేటా ని ఇలా క్లియర్ చేసేయండి..!

-

కొన్ని కొన్ని సార్లు మార్కెట్ లో వచ్చిన కొత్త ఫోన్ కొనుక్కుంటే బాగుంటుంది అని మనకి అనిపిస్తుంది. అలాంటప్పుడు పాత ఫోన్‌ను పక్కనబెట్టి కొత్త ఫోన్లను తీసుకుంటూ ఉంటాము. కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత పాత ఫోన్‌ను చాలా మంది అమ్మేస్తారు. అయితే ఫోన్ ని అమ్మేసే ముందు డేటా ని క్లియర్ చేసేయాలి. డేటా, ఇతర వివరాలను అలాగే ఉంచేయడం వలన ఇబ్బందులొస్తాయి.

 

పాత స్మార్ట్‌ఫోన్ నుండి మీ మొత్తం డేటాను ఎలా తొలగించవచ్చు అనే దాని కోసం ఇప్పుడు చూద్దాం. వ్యక్తిగత డేటాను తొలగించడానికి లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం పెద్ద కష్టం ఏమి కాదు. ఈజీగా చాలా తక్కువ సమయం లో మనం తొలగించ వచ్చు. శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్, గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లో రీసెట్ లేదా డేటా ని ఎలా తొలగించాలి అనేది చూద్దాం.

మొబైల్‌లోని వాట్సాప్‌, ట్విటర్‌, ఎంఎస్‌ ఆఫీస్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ అకౌంట్‌, జీమెయిల్‌ వంటి అకౌంట్లను లాగ్ అవుట్ చెయ్యాలి.
అలానే మీరు గూగుల్ అకౌంట్‌ నుంచి లాగౌట్ చేయాలి.
ఇలా చేస్తే పాత ఫోన్‌లోని వివరాలు సింక్‌ కాకుండా ఉంటాయి.
మొబైల్‌లో మైక్రో ఎస్‌డీ కార్డు, సిమ్‌ కార్డులను కూడా తీసేయాలి.
అదే విధంగా ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ ని కూడా చెయ్యాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి జనరల్‌ మేనేజ్‌మబెంట్‌పై క్లిక్‌ చేస్తే అందులో రీసెట్‌ సెక్షన్‌పై క్లిక్ చెయ్యాలి. అక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చెయ్యాలి. అప్పుడు డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఫోన్ రీస్టాట్ అవుతుంది.
తర్వాత ఫోన్‌ ఆన్‌ చేస్తే ఆండ్రాయిడ్ వెల్‌కమ్‌ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది.
దాంతో కొత్తగా మీ ఫోన్ ఉపయోగించేవారు తమ మీ వివరాలు ఎవరికీ తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news