గుప్పెడంతమనసు ఎపిసోడ్ 259: బెడిసికొట్టిన దేవయాని ప్లాన్..మహేంద్రముందు అడ్డంగా బుక్కైన వదిన

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుసధార కుంటుకుంటూ వెళ్తుంది. రిషీ పిలిచి కాలుకి ఏమైంది అని అడిగితే..ఏదో చిన్న ప్లాబ్లమ్ అంతే తగ్గిపోతుంది, బాగానే నడుస్తున్నాను సార్ అంటుంది. రిషీ మనసులో ఏంటో ఈ పొగరు, కిందపడ్డా తనదే పై చేయి అనుకుంటుంది, కాలుకి ఏమో అయింది, కుంటుతుంది అయినా ఒప్పుకోదు అనుకుంటాడు. వసూ శిరీష్ దగ్గరకు వచ్చి డ్యాన్స్ ప్లాక్టిస్ చేయటానికి వెళ్తుంది. అలా ప్రాక్టీస్ చేయబోతుంది..ఇంతలో రిషీ వస్తాడు. కుంటుకుంటూ డ్యాన్స్ చేస్తే బాగుంటుందా అని రిషీ అడిగితే..శిరీష్ అప్పుడు ఏమైంది అని అడుగుతాడు. కాలు కొంచెం బెనికింది అంటుంది వసూ..అయినా పర్లేదు నేను డ్యాన్స్ చేస్తాను అంటుంది. రిషీ కాలు నొప్పితో డ్యాన్స్ చేయటం కుదరదు, నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అంటాడు. శిరీష్ మీకెందుకు సార్ టెన్షన్ చిటికెలో తగ్గిస్తాను అని ఒక చైర్ తీసుకొచ్చి వసూని అందులో కుర్చోపెట్టి కాలు శిరీష్ మోకాలుపై పెట్టుకుని కాలు అటూఇటూ తిప్పుతాడు. పెయిన్ పోతుంది. ఇదంతా చూస్తున్న రిషీకి కాల్తా ఉంటుంది. అక్కడినుంచి తన క్యాబిన్ కి వచ్చి నేను.. శిరీష్ వసుధారతో క్లోస్ గా ఉంటే ఎందుకు డిస్టబ్ అవుతున్నాను, అయినా వసుధార శిరీష్ తో అంత క్లోజ్ గా ఉండటం అవసరమా అనుకుంటాడు. ఇటువైపు డ్యాన్స్ ప్రాక్టీస్ రూంకి జగతి, మహేంద్ర వస్తారు. వాళ్లు అలా చూస్తారు.

ఇంట్లో దేవయాని ధరణిని పిలిచి పక్కన కుర్చోపెట్టుకుంటుంది. ధరణికి ఏం అర్థంకాదు. దేవయాని చాలా ప్రేమగా మాట్లాడుతుంది…అత్తకోడళ్లు అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ లా ఉండాలి, అస్థమానం నువ్వు నాకెందుకు భయపడతావ్, నేను ఏమన్నా నిన్ను ఇబ్బందిపెడుతున్నానా అంటుంది. ధరణి మనసులో అత్తయ్య ఏంటో ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటుంది. దేవయాని ఆ జగతి, వసుధార ఏంటి ఏదో ప్రాగ్రామ్ అంటున్నారు, హడావిడి చేస్తున్నారు అని అడుగుతుంది. ధరణి కొంచెం తెలుసు, చాలా తెలియదు అంటుంది. ఇదే నీతో వచ్చిన సమస్య, ఏం తెలియదు అని ఆ వసుధార నీకు మంచి ఫ్రెండ్ అయిందికదా, ఫోన్ చేసి తెలుసుకుకో అంటుంది..ధరణి మావయ్యగారిని అడిగితే సరిపోతుందికదా అంటుంది. ఎవర్ని అడిగితే ఏం తెలుస్తుందో నాకు తెలుసుకానీ..నువ్వు వసుధారకు ఫోన్ చేయ్ అని బలవంతంగా ధరణితో వసూకి ఫోన్ చేయిస్తుంది.

వసూ డ్యాన్స్ ప్రాక్సీట్ చేస్తూ ఉంటుంది. ఫోన్ మోగటం జగతి, మహేంద్ర చూసి..వసూ ఫోన్ మహేంద్ర నేను మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటుంది జగతి. కనీసం ఎవరో ఏంటో చూడు జగతి అంటాడు మహేంద్ర. ఇటుపక్క ధరణి..అత్తయ్యగారు, ఫోన్ రింగ్ అవుతుంది, ఏం మాట్లాడాలో, ఏం అడగాలో నాకేం అర్థంకావట్లేదు అంటే..ఒక్క పనికి కూడా పనికిరావేంటి నువ్వు అని నేను మాట్లాడతా అని ఫోన్ తీసుకుంటుంది దేవయాని. జగతి ..ధరణి అని చూసి నేను మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది. మహేంద్ర నేను మాట్లాడుతా అని తీసుకుని హలో అంటాడు. దేవయాని హలో అనటంతో..మహేంద్ర గొంతు గుర్తుపట్టి వదినా అంటాడు. దేవయానికి ఫీజులు ఎగిరిపోతాయ్..ఫోన్ వెంటనే ధరణికి ఇచ్చి మాట్లాడు అంటుంది. ధరణి కూడా చాలా తెలివిగా..ఆ మావయ్యగారు అంటే..ఏంటి ఇందాక మాట్లాడింది వదినే కదా అంటాడు మహేంద్ర.. అవును, మీతో ఏదో మాట్లాడాలంటా అని ఫోన్ మళ్లీ దేవయానికి ఇస్తుంది. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది. దేవయాని..నీకు ఏమన్నా మెంటలా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలికానీ, ఫోన్ మళ్లీ నాకే ఇస్తావ్ అంటుంది. ధరణి ఫోన్ తీసుకుని కొంచెం ముందుకెళ్లి.. అత్తయ్యగారు వసుధారతో మాట్లాడాలని ప్లాన్ వేశారు మావయ్య.. అదికాస్తా బెడిసికొట్టింది..నేను వివరాలన్నీ తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. జగతి ఏమైంది అని అడిగితే..వదిన ధరణి ఫోన్ నుంచి వసుధారతో మాట్లాడాలి అనుకుంది అని చెప్తాడు..జగతి..అక్కయ్య ఈ మధ్య వసుధారమీద కూడా విషం కక్కాలని చూస్తుంది అని వసూ వైపు అలా చూస్తారు. మహేంద్రతో వసుధార గురించి మాట్లాడకుంటారు.

ఆరోజు రాత్రి వసూ లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రిషీ ఫోన్ చేస్తాడు. వసూ ఫోన్ లిఫ్ట్ చేసి..హలో హలో అని అరుస్తుంది. హలో వసుధార ఏంటి అలా అరుస్తున్నావ్, ఫోన్ లో ప్రశాంతంగా మాట్లాడాలి అంటాడు రిషీ. వసూ మనసులో ప్రశాంతత గురించి తుఫాన్ చెప్పినట్లు ఉంది అనుకుంటుంది. ఫోన్ ఎందుకు చేశావో అడగవా అంటే..వసు తెలుసుకదా అని కాలేజ్ వర్క్ గురించి అడుగుతారు అంతే కదా అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో జగతి వస్తుంది. వసూ ఇష్ అని స్లోగా మాట్లాడుతుంది. రిషీ ఏంటి మేడమ్ పక్కనే ఉన్నారా అని అడుగుతాడు..వసూ ఉన్నారు సార్, కొంచెం దూరంగా అంటుంది. రిషీ ఫోన్ మోడమ్ కి ఇవ్వు అంటే..వసూ కావాలనే గట్టిగా అరుస్తుంది..మేడమ్ మీకు ఫోన్ , రిషీ సార్ మాట్లాడతారంటా అంటుంది. రిషీ హలో యూత్ ఐకాన్..పక్కనే ఉన్నారుకానీ ఫోన్ ఇవ్వు అంటుంది. వసూ ఎలా తెలిసింది సార్ అంటే తర్వాత చెప్తాను కానీ ముందు ఫోన్ ఇవ్వు అంటాడు. జగతికి ఫోన్ ఇస్తుంది. రిషీ ఎడ్యూకల్చర్ ఆలోచన అంతా మీదే కదా..ప్రోగ్రామ్ మొదటి నుంచి చివరి వరకూ మీరే చూసుకోవాలి అంటాడు. జగతి నేనా సార్ అంటుంది. అవును మీరే దగ్గరుండి ప్రోగ్రామ్ సక్సస్ చేయాలి అని ఫోన్ కట్ చేస్తాడు. జగతి నవ్వుకుంటూ ఫోన్ వసూకి ఇస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో కాలేజ్ లో స్టేజ్ డెకరేషన్ చేస్తూ ఉంటారు. వసూ చూసుకోకుండా రిషీకి తగులుతుంది. అలా వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శిరీష్ వచ్చి..నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావ్..రా అని చెయిపట్టుకుని తీసుకెళ్తాడు. రిషీకి కాలిపోతుంది..నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థంకాదా అంటాడు. అదికాస్తా జగతి-మహేంద్రలు చూస్తారు. మన ఇగో మాష్టర్ దీన్ని ఎలా కవర్ చేస్తాడో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version