కార్తీకదీపం ఎపిసోడ్ 1231: మోనిత కొడుకుని వెతకడం స్టాట్ చేసిన సౌందర్య.. దీప కష్టాన్ని చూసి బాధపడుతున్న కార్తీక్

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత పిల్లాడ్ని దాచి తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆనంద్ రావుగారు కూడా మీ మనవడేకదా..వాడు కనిపించటం లేదంటే మీరు ఎందుకు బాధపడటంలేదు..తనదాకా వస్తేకాని తెలియదంటారు..ఇప్పుడు తెలిసింది అనుకుంటా అని వెళ్లిపోతుంది.

దీప ఇంట్లో

శౌర్య, హిమ ఇద్దరూ స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతారు. స్కూల్ లో ఎవ్వరూ డాడీ డాక్టర్ అనే విషయం చెప్పొద్దు అని దీప పిల్లలకు చెబుతుంది. సరే అంటారు. కార్తీక్ వచ్చి..స్కూల్ దూరమా అంటే..దగ్గరే ఉంది..కాస్త దూరమైన నడుచుకుంటూ వెళ్తారు..ఆరోగ్యానికి మంచిది అంటుంది దీప. కార్తీక్..సారీరా కాలినడక స్కూల్ కి పంపుతున్నాను అంటాడు. తన జేబులో ఉన్న 10 రూపాయలు తీసి ఇచ్చికార్తీక్ ఏదైనా కొనుక్కోమంటాడు. ఇదొక్కటే ఉందమ్మా అంటే..హిమ వద్దు డాడీ..నీ దగ్గర కూడా లేవుకదా అంటుంది. నువ్వు కూడా నా మీద జాలిపడకమ్మా ప్లీజ్ అంటాడు. దీప తీసుకోమంటుంది.తీసుకుని వెళ్లిపోతారు.

మరోవైపు సౌందర్య, ఆనందరావు, ఆదిత్య ముగ్గురూ కూర్చుని తింటుంటే అక్కడకు వచ్చిన మోనిత..ఏంటి ఇవాళ వంటలు అంటూ డైనింగ్ టేబుల్ పై కూర్చుంటుంది. నాకు వడ్డించు శ్రావ్య అనడంతో..ఛీఛీ అంటూ లేస్తాడు ఆదిత్య. సౌందర్య నువ్వెందుకు లేచావ్ రా..కుర్చో అని సిగ్గులేనిది దానికి..నువ్వెందుకు లేస్తున్నావ్ కూర్చో అంటూ గట్టిగానే ఇస్తుంది. నాకు ఉన్నది ఇద్దరు మనవరాళ్లు, ఒకే మనవడు అంటుంది
సౌందర్య. మోనిత నా కొడుకు కూడా మీ మనవడే అంటుంది. అసహజంగా బిడ్డను కని ఈ ఇంటిమీదకు వచ్చి మా పరువు తీసి.. బిడ్డను తీసుకొచ్చి మా మనవడు అంటే సరిపోతుందా..ప్రతి దానికీ నువ్వే అడ్డదారిలో గెలుస్తావని అనుకోకు..ఇది నా ఇల్లు..ఇది సౌందర్య ఇల్లు..నీ ఆటలు ఇక్కడ సాగవ్… నాకు కోపం వచ్చిందంటే రెండు నిముషాల్లో నీ జీవితం తారుమారైపోతుంది. జాగ్రత్తగా ఉండు..గెట్ అవుట్ అంటుంది సౌందర్య. మోనిత వెళ్లిపోతుంది.

మరోవైపు దీప సరుకుల కోసం కిరాణం షాపుకి వెళుతుంది. సరుకులు ఇవ్వు అంటే ఈ సరుకులు లేవంటాడు వ్యాపారి. ఎందుకు లేవంటున్నావ్, అన్నీ కనిపిస్తున్నాయ్ కదా అని దీప అంటే.. నాకు రుద్రాణే కనిపిస్తుంది అంటాడు. కోటేశ్, శ్రీవల్లి వాళ్ల సరకులు తీసుకోవడానికి వచ్చాను అంటుంది దీప. నాకు కోటేశ్ బాకీ ఉన్నాడు…ముందు బాకీ తీర్చు అంటాడు. దీంతో కోటేశ్ నీకు ఇవ్వమని డబ్బులు ఇచ్చాడు.. అవి కూడా వద్దా అంటుంది దీప. ఇవ్వండి.. సరుకులు మీకు ఇవ్వను. కోటేశ్ కు ఇస్తున్నాను అంటాడు. సరుకులు తీసుకుని వెళ్తుంది దీప.

కట్ చేస్తే స్కూల్ కి వెళ్లిన పిల్లలు లంచ్ టైమ్ లో స్కూల్లోనే భోజనం పెడుతున్నారని తెలిసి అక్కడికి వెళతారు. ఆయా రమ్మని పిలుస్తుంది. హిమ నాకు తినాలనిపించటం లేదు. నువ్వు తిను శౌర్య అంటుంది. నువ్వు తినకపోతే నేనూ తినను అంటుంది శౌర్య. తప్పనిసరి పరిస్థితుల్లో..వెళ్లి కుర్చుంటారు. హిమ ఒకప్పుడు గతంలో డైనింగ్ టేబుల్ మీద కుర్చోని తిన్న సీన్ తలుచుకుని..హిమ నాకు ఇక్కడ ఏం నచ్చలేదు శౌర్య వెళ్లిపోదాం అంటారు. శౌర్య..హిమకు బుజ్జగిస్తుంది.

మరోవైపు రత్నసీతను కలిసిన సౌందర్య..నువ్వు మోనిత వైపు ఎందుకు ఉన్నావో, మోనిత మాటలు ఎందుకు విన్నావో తెలియదు..దానివల్ల మేము చాలా నష్టపోయాం అంటుంది సౌందర్య. మోనిత తన బిడ్డను నీ దగ్గర దాచిపెట్టిందా అని అడుగుతుంది. దీంతో లేదు మేడమ్ నా దగ్గర తన బిడ్డ లేదు అంటుంది. రత్నసీత. అయితే ఒక పని చేస్తావా? నేను చెప్పిన ఒక్క పని నాకోసం చేస్తావా? అని అడుగుతుంది సౌందర్య. దీంతో సరే మేడమ్ చేస్తాను అంటుంది రత్నసీత. మోనిత ఎక్కడికి వెళ్తుందో.. ఎవరిని కలుస్తుందో నాకు చేసి పెట్టు అదొక్క సాయం నాకు చేయి అంటుంది. రత్నసీత నేను చేస్తాను అంటుంది.

మరోవైపు దీప సరుకులు తీసుకుని ఇంటికి మోసుకెళ్తూ ఉంటుంది. వ్యాపారి అన్న మాటలను తలుచుకుంటూ నడుస్తుంది. దీప సరుకులు మోసుకురావడం చూసిన కార్తీక్ బాధపడతాడు. నువ్వు ఇలా మోయడం ఏంటి ఇటివ్వు అని దించుతాడు. సారీ దీప నిన్ను ఇలా కష్టపెడుతున్నాను అంటే.. వంటలక్కకు ఇవన్నీ మామూలే కార్తీక్ బాబు అంటుంది. వంటలక్కగా నువ్వు మారడానికి కూడా కారణం నేనే కదా అంటాడు కార్తీక్. మీరు నా పక్కన ఉంటే ఏదీ కష్టం కాదు అంటుంది దీప. నీ కష్టాలన్నింటికీ నేను బాధ్యుడిని అంటూ అక్కడ ఒక పెద్ద ఆకు ఉంటే దానితో దీపకు గాలి విసురుతాడు. దీప వద్దన్నా కాదనకు అని గాలి విసురుతాడు.
.
పిల్లలకు సరైన భోజనం పెట్టలేకపోతున్నాను, నిన్ను కష్టాల పాలు చేస్తున్నాను అంటాడు కార్తీక్. దీంతో ప్రతి స్త్రీకి భర్త తోడు ఉంటే చాలు కార్తీక్ బాబు అంటుంది. మన కష్టాలు మనకుంటే..ఆ రుద్రాణి తలనొప్పి ఒకటి..రుద్రాణి అప్పెలా తీరుస్తాం, పిల్లలకు పుస్తకాలు కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాం అంటాడు కార్తీక్. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో
రేపు బాబుకు నామకరణం చేద్దాం అంటుంది శ్రీవల్లి . ఇంతకీ పేరు ఏం పెడదామని అనుకుంటున్నావు అని అంటుంది దీప. ఆనంద్ అని పెడదామని అనుకుంటున్నా అంటుంది శ్రీవల్లి. ఆనంద్ ఎందుకు అంటే.. ఏమో తెలియదు కానీ.. కోటేశ్… బాబును దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆనంద్ అనే పేరే పెడదామని అనుకుంటున్నాడు అంటుంది శ్రీవల్లి. దీంతో కార్తీక్, దీప షాక్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version