మ‌రో సారి త‌గ్గుముఖం ప‌ట్టిన బంగారం, వెండి ధ‌ర‌లు..

-

బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రో సారి త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,670 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయలు తగ్గి 36,360 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గి 38,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 37,100 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 200 రూపాయలు తగ్గింది. దీంతో 47,800 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news