Aadhaar Card : ఆధార్ కార్డు చాలా విలువైన డాక్యుమెంట్. అందుకే దానిలో ఏవైన తప్పులు ఉన్నాయో లేవో సరి చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా ఈ పత్రాలు అందించాల్సిందే. ఈ విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆధార్ కార్డు హోల్డర్లు ఇక నుంచి వారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ కచ్చితంగా ఇవ్వాలని UIDAI స్పష్టం చేసింది. మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీరు మీ ఆధార్ కార్డులో పేరు లేదా మీ అడ్రెస్సుని మార్చాలి అంటే కచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ పాస్ పోర్ట్ డాక్యుమెంట్ ఉండదు కాబట్టి పాన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అయితే రేషన్ కార్డులు చిరునామా రుజువుగా పరిగణించబడవు. దీంతో చాలామంది వారి ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
అందువల్ల ఇటీవల విద్యుత్, నీరు, టెలిఫోన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్ గా ఇవ్వవచ్చని ప్రభుత్వం స్పష్టం చెయ్యడం జరిగింది. అయితే ఎవరి పేరుతో కరెంట్ బిల్, టెలిఫోన్ బిల్ లేదా నీటి బిల్ ఉంటుందో వారు మాత్రమే వారి ఆధార్ కార్డులో అడ్రెస్ని అప్డేట్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు.ఇంకా అలాగే పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులను కూడా అప్డేట్ కోసం మీరు సమర్పించుకోవచ్చు.
అలాగే ఆధార్ కార్డు ఉన్న వారు తమ జీవిత వైద్య బీమా పాలసీలను పొందవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి అని అనుకునేవారు పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఉపయోగించుకుని మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవచ్చు.