గుడ్‌న్యూస్‌: వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు

-

యూనిక్ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యుఐడిఎఐ)  దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆధార్‌ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటైంది. ఇక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆధార్ సేవ కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్ వాసుల కోసం తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోనే తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది యుఐడిఎఐ.

ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన మొదట్లో ప్రతీ మంగళవారం సెలవు ప్రకటించింది యుఐడిఎఐ. అంటే ఆధార్ సేవా కేంద్రాలు కేవలం వారంలో ఆరు రోజులు మాత్రమే సేవలు అందించేవి. ప్రతీ మంగళవారం సెలవు ఉండేది. అయితే ఆధార్ సేవా కేంద్రాలకు ఆధార్ సేవల కోసం వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వారంలో యుఐడిఎఐ 7 రోజులు సేవలు అందించాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news