ఆధార్ ఈ మూడింటికి త‌ప్ప‌నిస‌రి.. అవేమిటంటే..?

-

కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందాల‌న్నా, లేదా స‌బ్సిడీల‌ను వినియోగించుకోవాల‌న్నా ఆధార్ వివ‌రాల‌ను ఎవ‌రైనా స‌రే స‌మ‌ర్పించాల్సిందే.

ఆధార్ కార్డు వినియోగంలోకి వ‌చ్చాక ప్ర‌తి సేవ‌కు దాన్ని అనుసంధానం చేసుకోవాల‌ని ఊద‌ర‌గొడుతూ వ‌చ్చారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్ర‌భుత్వ హ‌యాంలోనైతే ఆధార్ అనుసంధానంతో జ‌నాలు విసిగిపోయారు. పిల్ల‌ల‌కు స్కూల్ అడ్మిష‌న్ పొందాల‌న్నా, విద్యార్థుల‌కు కాలేజీలో చేరేందుకు, మొబైల్ క‌నెక్ష‌న్ల‌కు, బ్యాంక్ అకౌంట్లకు, యూజీసీ, నీట్‌, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌కు, ఇన్సూరెన్స్‌కు.. ఒక్క‌టేమిటి.. అనేక సేవ‌ల‌కు ఆధార్‌ను క‌చ్చితంగా అనుసంధానం చేసుకోవాల‌ని, లేదంటే ఆ సేవ‌ల‌ను పొంద‌లేర‌ని జ‌నాల‌ను హ‌డ‌ల‌గొట్టారు. దీంతో కొంద‌రు ఈ విష‌యంపై సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దీంతో సుప్రీం కోర్టు కేంద్రానికి మొట్టికాయ‌లు వేసింది. అన్ని సేవ‌ల‌కు ఆధార్ అవ‌స‌రం లేద‌ని, కేవ‌లం కొన్నింటికి మాత్రేమే ఆధార్‌ను అనుసంధానిస్తే చాల‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రి ఏయే సంద‌ర్భాల్లో ఆధార్ వివ‌రాల‌ను ఇవ్వాలో, ఆధార్‌ను అనుసంధానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

* ఆధార్‌ను పాన్ కార్డుకు క‌చ్చితంగా అనుసంధానం చేయాల‌ని సుప్రీం కోర్టు చెప్పింది. ఎందుకంటే.. దేశంలో న‌కిలీ పాన్ కార్డుల‌ను త‌యారు చేసి చాలా మంది ఆదాయ‌పు ప‌న్ను ఎగ్గొడుతున్నార‌ని, అందుకు గాను ఆధార్‌ను పాన్‌తో అనుసంధానం చేస్తే ఇలా న‌కిలీ పాన్ కార్డుల‌ను త‌యారు చేసే వారి ఆటక‌ట్టిన‌ట్టు అవుతుందని, దీంతో అంద‌రూ ఆదాయ‌పు ప‌న్ను క‌డ‌తార‌ని సుప్రీం కోర్టు తెలిపింది. క‌నుక మీకు పాన్ కార్డు ఉంటే క‌చ్చితంగా దాన్ని ఆధార్‌కు అనుసంధానించాల్సిందే.

* కేంద్ర లేదా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందాల‌న్నా, లేదా స‌బ్సిడీల‌ను వినియోగించుకోవాల‌న్నా ఆధార్ వివ‌రాల‌ను ఎవ‌రైనా స‌రే స‌మ‌ర్పించాల్సిందే.

* పౌరులు త‌మ ఇన్‌క‌మ్‌ట్యాక్స్ రిట‌ర్న్స్‌ను ఫైలింగ్ చేసేట‌ప్పుడు కూడా ఆధార్ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. దీంతో ఆదాయ‌పు పన్ను క‌ట్టేవారిని, క‌ట్ట‌నివారిని గుర్తించ‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది.

పైన చెప్పిన మూడు సంద‌ర్భాల్లో మాత్రం మీరు ఆధార్ వివ‌రాల‌ను తెల‌పాల్సి ఉంటుంది. అవి తప్ప మిగిలిన ఏ సేవ‌లను పొందాల‌న్నా.. అందుకు ఆధార్ వివ‌రాల‌ను తెల‌పాల్సిన ప‌నిలేదు. క‌నుక ఈ విష‌యం గుర్తుంచుకుంటే చాలు.. ఆధార్‌ను ఎక్క‌డ వాడాలో మీకు సుల‌భంగా తెలిసిపోతుంది..!

మీకు ఈ స‌మాచారం న‌చ్చితే ఈ లింక్‌ను ఇత‌రుల‌కు షేర్ చేయ‌డం మ‌రిచిపోకండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version