’గూగుల్‌ క్రోమ్‌’ పేరుతో నకిలీ యాప్‌!

గూగుల్‌ క్రోమ్‌ పేరుతో నకిలీ యాప్‌ క్రియేట్‌ అయ్యింది. అది ఒకవేళ మీరు డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటే వెంటనే డిలిట్‌ చేయండి. దీన్ని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌ల ద్వారా హ్యాకింగ్‌ చేసేవారు. ఇప్పుడు ఏకంగా గూగుల్‌ క్రోమ్‌ యాప్‌నే హ్యాకర్స్‌ మోసాలకు వాడుకుంటున్నారు. స్మిషింగ్‌ ట్రోజాన్ అనే మాల్‌ వేర్‌ను ఫోన్లోకి పంపించి… మొబైల్‌నే ఏకంగా మాల్‌వేర్‌ సూపర్‌ స్ప్రెడర్‌గా మార్చేస్తున్నారని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫేక్‌ యాప్‌ గురించి టెక్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సైబర్‌ నేరగాళ్లు మొదట మీకు విదేశాల నుంచి ఒక పార్సిల్‌ వచ్చిందని కొంత డబ్బు కట్టాలని మెసేజ్‌ పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేస్తే మీ క్రోమ్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌ చేసుకోండి అని నోటిఫికేషన్‌ వస్తుంది. ఓకే కొడితే బ్రౌజర్‌ కొత్త వెర్షన్ అంటూ ఓ యాప్‌ వచ్చి మొబైల్‌లో చేరుతుంది. అందులో పేమెంట్‌ చేస్తే, ఇక అంతే మీ వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. మీరు పే చేసిన బ్యాంకు ఖాతాలోని డబ్బు మొత్తాన్ని హ్యాకర్లు ట్రాన్స్‌
ఫర్‌ చేసుకుంటున్నారు. దీన్నే స్మిషింగ్‌ ట్రోజాన్ అంటున్నారు.

కేవలం డబ్బులు పోవడం ఒక్కటే కాదు. సూపర్‌ స్ప్రెడర్‌. మీ మొబైల్‌ను హ్యాక్‌ చేసి బ్యాంకు ఆన్ లై న్ వివరాలు కొట్టేసి డబ్బులు తీసుకోవడంతోపాటు, మీ మొబైల్‌లోని మెసేజ్‌లు, కాంటాక్ట్స్, కాల్‌ హిస్టరీ వివరాలు కూడా ఈ ట్రోజాన్ తీసుకుంటోంది. దాంతో మీ మొబైల్‌ నుండి రోజూ రెండు, మూడు గంటల వ్యవధిలో మీ కాంటాక్ట్స్‌కు ఆ ట్రోజాన్ స్పామ్‌ మెసేజ్‌ వెళ్తుంది. అయితే ఫేక్‌ యాప్, ఒరిజినల్‌ యాప్‌ ఒకేలా ఉండటంతో గుర్తుపట్టడం కష్టమే. కానీ, యాప్‌ ఇన్ఫోలో ప్యాకేజీ వివరాలు చూసి నఖిలీని గుర్తుపట్టొచ్చు.

యాంటీ వైరస్‌లు సైతం ఈ నఖిలీ క్రోమ్‌ యాప్‌ను గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు యాప్‌ను సిద్ధం చేశారు. అందుకే ఈ ఇబ్బంది రాకూడదు అంటే… ఇలాంటి లింక్స్‌ను నమ్మకపోవడం ఒకటే మార్గం. ఏదైనా యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలన్నా, ఇన్ స్టాల్‌ చేసుకోవాలన్నా ప్లే స్టోర్, మీ ఫోన్‌ యాప్‌ స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.