అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో అమెజాన్‌..

-

ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు శుభవార్త.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఈ పండుగల సీజన్‌లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు భారీ ఆఫర్లను కస్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్నట్లు ఈ సంస్థ క్యాటగిరీ మెనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ తెలిపారు. ఈ సేల్ సందర్భంగా అమెజాన్ కొత్త లాంచ్ లు, ఇప్పటి వరకు ఉన్న ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని డిస్కౌంట్లు ఇవ్వనుంది.

బజాన్‌ ఫిన్‌సర్వ్, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో–కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. వేగవంతమైన డెలివరీ, 30–రోజుల మార్పిడి విధానం ఈసారి ప్రత్యేకతలన్నారు. గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్‌ విభాగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు మాత్రం ఈ సేల్ 12 గంటల ముందుగానే ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version