ఆయుష్మాన్‌ భారత్‌ VS ఆరోగ్య శ్రీ కార్డు.. ఈ కార్డులకు ఎవరు అర్హులు..?

-

పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆరోగ్య శ్రీని పథకం ప్రవేశం పెట్టారు. తెలంగాణ వచ్చాక..అదే పేరుతో కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పథకం పేరు మార్చి కొనసాగిస్తున్నారు. గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సభ్యులందరికీ ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆరోగ్యశ్రీ కార్డు లేదా ఆయుష్మాన్ కార్డును ఒక్కొక్క వ్యక్తికి డిజిటల్ కార్డుగా అందిస్తోంది. ఈ క్రమంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క డిజిటల్ కార్డు మీ సేవ, సీఎస్సీ సెంటర్, ఆన్లైన్ సెంటర్ ద్వారా పొందేందుకు వీలు కల్పించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ చేసుకొని కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి, అర్హతలు రెండింటికి ఒకేలా ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు చూద్దాం.!

ఆయుష్మాన్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీ లేదా ఆయుష్మాన్ కార్డుపై 1500 రకాల రోగాలు, శస్త్ర చికిత్సలు, సుమారు 900 రకాల వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ మీసేవ, సీఎస్సీ, ఆన్ లైన్ సెంటర్ల ద్వారా ఈకేవైసీ చేసుకొని ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు పొందవచ్చని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఆహార భద్రతా కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు ఆరోగ్య శ్రీ కార్డుకు అర్హులే. ఈ కార్డు ద్వారా కూడా 5 లక్షల ఇన్సురెన్స్‌ వర్తిస్తుంది. ఇంతకు ముందు ఈ పరిమితి 2 లక్షల వరకే ఉండేది.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రోగ్రామ్‌కు అర్హత పొందేందుకు వ్యక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉండాలి. కోరుతున్న నిర్దిష్ట ఆరోగ్య సేవలపై ఆధారపడి ఈ ప్రమాణాలు మారవచ్చు. అయితే, సాధారణంగా, ప్రోగ్రామ్ క్రింది వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది.

aroghya Sri

ఆరోగ్య శ్రీ కార్డుకు ఎవరు అర్హులు..

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వ్యక్తులు లేదా ప్రభుత్వం బలహీనులుగా గుర్తించబడిన వారు.
ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులు.
ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి సిఫార్సు చేయబడిన వ్యక్తులు.

ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా పథకం మినహాయింపులు
ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా పథకం మినహాయింపులు క్రింది విధంగా ఉన్నాయి.

గుండె వైఫల్యాల కోసం సహాయక పరికరాలు
కాలేయ మార్పిడి
ఎముక మజ్జ విధానాలు
న్యూరోసర్జరీలో గామా-కత్తి విధానాలు
హిప్ మరియు మోకాలి మార్పిడి

ఆరోగ్య శ్రీ కింద కవర్‌ చేసే వ్యాధులు
క్యాన్సర్‌
గుండెజబ్బులు
కిడ్నీ వ్యాధి
నరాల పరిస్థితి
ఆర్థోపెడిక్ పరిస్థితులు
జీర్ణశయాంతర పరిస్థితులు
శ్వాసకోశ పరిస్థితులు
బర్న్స్
నియోనాటల్ కేర్

ఆయుష్మాన్‌ భారత్‌

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం చాలా రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రధానంగా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆసుపత్రి ఖర్చులు భరించే స్తోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టపోతుంచారు. ఇలాంటి వారి కోసం కేంద్ర సర్కార్ ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తీసుకొచ్చింది. దీనినే ఆయూష్మాన్ భారత్ యోజన అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. దీని ద్వారా కోట్లాది మంది సామాన్య ప్రజలు లబ్ధి పొందుతారని కేంద్రం చెబుతోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో కుటుంబం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందేందుకు అవకాశం ఉంది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ పథకాన్ని సెప్టంబర్ 23, 2018న ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా 21 వ్యాధులను కవర్‌ చేయవచ్చు.

ఆయుష్మాన్ భారత్ అర్హతలు..

  • ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే పేద, బడుగు బలహీన ఆదాయ వర్గాలకు చెందిన వారు అర్హులు.
  • ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలు, కార్మికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
  • మీరు మీ అర్హతను చెక్ చేసుకోవాలంటే PMJAY అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి చూసుకోవచ్చు.
  • ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం పొందవచ్చు.
  • ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా వచ్చే 15 రోజులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.
  • ఈ పథకం ద్వారా మీరు ఒక్క రూపాయి కూడా నగదుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు.

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు..

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), పాస్ పోర్ట్ సైజు ఫోటో ఉండాలి.

ఆయుష్మాన్‌ భారత్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  • ఆయుష్మాన్ భారత్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా PMJAY అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
  • కొత్త రిజిస్ట్రేషన్ కోసం న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, జెండర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డు మొదలైన వాటి సమాచారాన్ని నమోదు చేయాలి.
  • మీరు నమోదు చేసిన సమచారం సరిగా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి.
  • అడిగిన డాక్యుమెంట్లు అన్నీ అప్‌లోడ్ చేయాలి.
  • మొత్తం దరఖాస్తు ఫారమ్ ఓసారి చెక్ చేసుకుని సమర్పించాలి.
  • ఆ తర్వాత మీ దరఖాస్తును అధికారులు సమీక్షిస్తారు.
  • ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీరు ఆయూష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • పూర్తి వివరాల కోసం.. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేయొచ్చు. లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version