SBI: రుణగ్రహీతలకు బ్యాడ్ న్యూస్…!

-

మీరు ఏదైనా లోన్ తీసుకున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దేశీ పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఏప్రిల్ 1 నుంచి రుణ రేట్లు పెంచేసింది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. ఇప్పుడు ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి.

ఇది ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మిగిలిన బ్యాంకులు కూడా ఇలా మార్చే అవకాశం కనపడుతోందని నిపుణులు అంటున్నారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. కేవలం దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాదు దేశీ అతిపెద్ద మోర్ట్‌గేజ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఇటీవల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది.

ఒకవేళ అన్ని బ్యాంకులు ఇలానే ఉంటే బ్యాంకులు ఈఎంఐ భారాన్ని పెంచకుండా లోన్ టెన్యూర్‌ను పెంచేస్తాయి. అలానే ఇతర బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలపై వడ్డీ రేట్లను పెంచితే ఈఎంఐ భారాన్ని పెంచకుండా లోన్ టెన్యూర్‌ను పెంచేస్తాయి. ఇది ఇలా ఉంటే రూ.50 లక్షల ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఉన్న హోమ్ లోన్ విషయానికి వస్తే..

వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరిగితే… లోన్ టెన్యూర్ 20 ఏళ్లు. అయితే ఇంకా 23 ఈఎంఐలు కట్టాల్సి ఉంది. మీరు లోన్ టెన్యూర్ పెంచుకోవద్దని భావిస్తే.. ఈఎంఐ నెలకు రూ.1515 మేర పెరుగుతుంది. అలానే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వారు లోన్ టెన్యూర్ పెంచుకోలేరు. కనుక భారం మరెంత పడుతుంది. ఒకవేళ మీ టెన్యూర్ ఇంకా 15 ఏళ్లు ఉంటే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోకుండా ఉండడం మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news