బిగ్ న్యూస్: తక్కువ ధరకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్.. ఈ రోజు నుంచి కొత్త రేట్లు అమలు

-

కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగు వేశాం. మొదటి రోజు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.10 వరకు తగ్గించనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు ఈ రోజు నుంచి అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర మళ్లీ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీంతో పెట్రోల్, డీజిల్‌తోపాటు ఎల్‌పీజీ గ్యాస్ ధరలు కూడా తగ్గుతుందని విశ్వసనీయ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రెట్లు తగ్గాయని, అందుకే ఎల్‌పీజీ ధర తగ్గడానికి కారణమైందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.

గ్యాస్ సిలిండర్స్

ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.10 తగ్గించడంతో.. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.809కే దొరకనుంది. గతంలో ఈ ధర రూ.1919గా ఉంది. ఈ రేటుతోనే ముంబైలో కూడా లభిస్తుంది. కోల్‌కతాలో సిలిండర్ రూ.885.50కి బదులు రూ.835.50కి లభించనుంది. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.835కి బదులు రూ.825కి లభించనుంది. ఎల్‌పీజీ వినియోగదారులు ఈ లింక్‌తో https://iocl.com/Products/IndaneGas.aspx రిజిస్టర్ అయినట్లయితే మీ నగరంలో కూడా గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం జరుగుతుందని ఇండియన్ కార్పొరేషన్ పేర్కొంది.

ఫిబ్రవరి నెలలోనే అత్యధికం..
వంట గ్యాస్ ధర కొంతకాలం వరకు మాత్రమే పెరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎల్‌పీజీ ధర రూ.125 వరకు పెరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖున ధర రూ.25 పెరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15వ తేదీన ధర రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 25వ తేదీన రూ.25, మార్చి 1వ తేదీన రూ.25 పెరిగింది. అలా పెరుగుతూ వచ్చిన ధరలు ముడి చమురు ధర తగ్గడంతో కొంతకాలంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 64 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మార్చి మొదటివారంలో ఇది 71 డాలర్లకు చేరుకుంది. రిటైల్ రంగంలో పెట్రోల్, డీజిల్ ధరలను లెక్కించడం ముడి చమురు రేటుపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ధరలు ఇంకా తగ్గనున్నట్లు సమాచారం. ప్రస్తుత ధోరణి ప్రకారం.. రేటు మాత్రమే తగ్గనుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు 15 రోజుల బెంచ్ మార్క్ ఇంధన రేట్లపై ఆధారపడి ఉండగా.. ప్రతినెల 1వ తేదీన ఎల్‌పీజీ రేటు మారుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version