స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనేక సేవలని అందిస్తున్న సంగతి తెలిసినదే. వినూత్న ఆలోచనల తో తమ బ్యాంకు కస్టమర్లు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా కొత్త కొత్త సేవలని ప్రవేశ పెట్టడం చూస్తున్నాం. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు తమ సర్వీసులను మెరుగు పరుచుకుంటూ తమ కస్టమర్లకు వివిధ సేవలని అందిస్తోంది. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు అందించేందుకు నిర్ణయించింది. మరి దానికి సంబందించిన వివరాలు ఇవే చూసేయండి.
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అలానే ఎక్స్క్లూజివ్ డీల్స్ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. ఫ్యాషన్ బ్రాండ్ పై ఈ బెనిఫిట్స్ లభించనున్నాయి. అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే… లైఫ్ స్టైల్ స్టోర్.కాం లో.. స్టేట్ బ్యాంకు ద్వారా కార్యకలాపాలు చేస్తే 30 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. వివిధ బ్రాండ్ల పై కూడా భారీగా తగ్గింపు ఉంటుంది.
రేమాండ్ పై 10% ప్లాట్ తగ్గింపు ఉంటుంది. బీబా పై 300 వరకు తగ్గింపు వస్తుంది. పలు రకాల బ్రాండ్ల పై కూడా పది శాతం వరకు ప్లాట్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ ని పొందాలంటే యోనో యాప్ ద్వారానే వీలు అవుతుంది. ఇలా కనుక స్టేట్ బ్యాంకు కస్టమర్లు యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే ఈ బెనిఫిట్స్ లభిస్తాయి.