ప్రస్తుత సమాజంలో అంతా ఆన్‌లైన్ అయింది. చిన్న చిన్న కొనుగోలు నుంచి ప్రభుత్వ దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు కూడా తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మరో అడుగుమందుకేసీ నూతన సంవత్సరంలో మరిన్ని నూతన యాప్‌లను అందుబాటులోకి తేనుంది. సిబ్బంది లేకుండాలనే తక్కువ సమయంలో ఎక్కువ మందికి సేవలు అందించడంతో పాటు అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా కొన్ని యాప్‌లు అందుబాటులోకి తీసుకురానుంది. జీహెచ్‌ఎంసీ సంబం«ధించిన జనన, మరణ ధ్రువపత్రాల జారీ, మోడల్ టాయిలెట్ల నిర్వహణ, ఎస్టేట్ ఆస్తుల చెల్లింపులు మరియు శునకాలకు ఇచ్చే వ్యాక్సిన్ల కోసం కొన్ని కొత్త యాప్‌లు అందుబాటులోకి తీసుకు రానున్నారు.
కొత్త ఏడాదిలో..
కుక్కల వస్తున్న ఫిర్యాదులపై వాటిని నియంత్రించేందుకు వాటికి శస్త్ర చికిత్సలు, ర్యాబిస్ వ్యాక్సిన్ వాటికి సంబం«ధించిన నిర్వహణ పనులను పలు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించిన జీహెచ్‌ఎంసీ వాటి నిర్వహణ ఎలా జరుగుతుందని తెలుసుకునేందుకు ఓ ప్రత్యేకయాప్ (పోర్టర్)ను అందుబాటులోకి తీసుకురానుంది. సంబంధిత నిర్వాహకులు కుక్కలను తీసుకెళ్లినప్పటి నుంచి వ్యాక్సిప్ ఆపరేషన్ చేస్తున్న ఫొటోలతో పాటు పూర్తి వివరాలు ఆ యాప్‌లో పొందుబరుస్తారు. మళ్లీ వాటిని తీసుకెళ్లి వదిలేసే వరకు అప్‌లోడ్ చేస్తూనే ఉంటారు. తద్వారా ఒక కుక్కకు పలుమార్లు ఆపరేషన్ చేసినట్లు చెప్పేందుకు వీలు ఉండదు.
బర్త్ సర్టిఫికెట్లు..
బర్త్‌సర్టిఫికెట్లు సైతం ఆన్‌లైన్‌లోనే జారీ కానున్నాయి. ఎవరైతే బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగానే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లాగిన్‌లోకి వెళ్తుంది. జారీకి ముందు సంతకం చేసే క్రమంలో సంబంధిత అధికారికి ఓటీపి వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడుతోంది.
అద్దెలపై..
జీహెచ్‌ఎంసీ ఎస్టేట్‌కు సంబం««ధించిన దుకాణాల చెల్లింపులు సైతం ఓ యాప్ ద్వారా జరగనున్నాయి. ప్రస్తుతం మ్యాన్‌వల్ ద్వారా జరుగుతున్న అద్దె చెల్లింపుల్లో అవినీతి జరుగుతున్నట్లు సమాచారం. ఈ యాప్‌ద్వారా ప్రతి దుకాణదారుడికి ఓ ప్రత్యేక కోడ్ ఉంటుంది. అద్దె కట్టాల్సిన వారికి ప్రతి నెల నిర్ణిత సమయానికి మెసెజ్ వస్తోంది. ఎస్టేట్ మెసెజ్‌మెంట్ సర్వీస్(ఈఎమ్‌ఎస్) పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సైతం..
ఇకపై పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సైతం ఆన్‌లైన్ ద్వారా జరగనుంది. దీని కోసం ఓ ప్రత్యేక క్యూర్‌కోడ్ వినియోగించనున్నారు. టాయిలెట్లు వినియోగించినప్పుడు వాటి నిర్వహణపై తమ తమ అభిప్రాయలు తెలపవచ్చు. ఉన్నతాధికారులు ఎక్కడినుంచైనా వాటి పరిశుభ్రత, కావాలసిన సౌకర్యాలను పరిశీలించవచ్చు. ఇకపై జీహెచ్‌ఎంసీకి సంబం««ధించిన పనులన్నీ ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి.