పబ్లిక్ ప్లేస్ లో ఫోన్లకు చార్జింగ్ పెడుతున్నారా.. ఫోన్ లోని డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే..!

-

Cyber criminals new scam Juice jacking

పబ్లిక్ ప్లేస్ లో ఫోన్లకు చార్జింగ్ పెడుతున్నారా? అయితే మీ ఫోన్ లోని డేటాను మీరు సైబర్ నేరగాళ్లను అందించినట్టే. మీ ఫోన్ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే. అది ఎలా అంటారా? అయితే మీరు జ్యూస్ జాకింగ్ గురించి తెలుసుకోవాల్సిందే.

సైబర్ నేరగాళ్ల నయా దోపిడి జ్యూస్ జాకింగ్. యూఎస్ బీ కేబుల్ ద్వారా ఫోన్ లోని డేటాను చోరీ చేయడమే జ్యూస్ జాకింగ్. పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ సెంటర్లే వాళ్ల అడ్డా. సైబర్ నేరగాళ్లు పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్లు చార్జింగ్ చేసుకోవడానికి ఉండే పోర్టులను టార్గెట్ చేస్తారు. ఆ పోర్టుల వెనుక డేటాను ట్రాన్స్ ఫర్ చేసే డివైజ్ ను అమర్చుతారు. ఈ విషయం తెలియక.. పబ్లిక్ ప్లేస్ లో ఫోన్ వినియోగదారులు యూఎస్బీ కేబుల్ తో తమ ఫోన్ కు చార్జింగ్ పెడతారు. అంతే.. చార్జింగ్ కోసం పెట్టిన అదే యూఎస్బీ కేబుల్ ద్వారా డేటాను తమ డివైజ్ లలోకి క్షణాల్లో ట్రాన్స్ ఫర్ చేసుకుంటారు సైబర్ నేరగాళ్లు.

వెంటనే ఆ సున్నితమైన డేటాతో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తారు. లేదంటే పర్సనల్ డేటాను అడ్డు పెట్టుకొని ఫోన్ చేసి బెదిరిస్తారు. పర్సనల్ డేటాను పబ్లిక్ డొమెయిన్లలో షేర్ చేస్తారు. ఇలా.. పలు రకాలుగా పర్సనల్ డేటాను అడ్డం పెట్టుకొని కస్టమర్లను బెదిరిస్తారు సైబర్ నేరగాళ్లు. ఇటువంటి నయాదందా ప్రస్తుతం సైబర్ పోలీసులను కూడా కలవర పెడుతోంది. చాలా మంది ఇలా పబ్లిక్ ప్లేసుల్లో తమ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకొని.. తమ డేటాను పోగొట్టుకొని… బ్యాంకు ఎకౌంట్ల నుంచి డబ్బులను పోగొట్టుకొని సైబర్ పోలీసుల వద్దకు పరిగెడుతున్నారు. దానిపై ఆరా తీసిన సైబర్ పోలీసులు.. సైబర్ నేరగాళ్లు జ్యూస్ జాకింగ్ టెక్నిక్ ను ఉపయోగిస్తున్నట్టు కనిపెట్టారు.

జ్యూస్ జాకింగ్.. జ్యూస్ అంటే పిండేయడం… డేటాను పిండేయడాన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. అందుకే పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెట్టుకోవడం చాలా వరకు తగ్గించాలని సైబర్ పోలీసులు చెబుతున్నరు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడే ఫోన్ ను ఫుల్ చార్జింగ్ చేసుకోవాలని… లేదంటే పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్లడం… లేదా మరో బ్యాటరీని సిద్ధంగా ఉంచుకోవడం.. లేదంటే చార్జర్ ను తీసుకెళ్లడం చేయాలని… ఎట్టిపరిస్థితుల్లోనూ యూఎస్బీ కేబుల్ తో మాత్రం పబ్లిక్ ప్లేసుల్లో చార్జింగ్ పెట్టకూడదని.. అలా చేస్తే మీ డేటా సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే అని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version