ఛత్రపతి శివాజీకి శ్రీశైల భ్రమరాంభికా దేవి ఖడ్గాన్ని ఇచ్చిన విషయం మీకు తెలుసా..ఆ కథేంటంటే..!

-

భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఛత్రపతిశివాజి. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు.

యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 2,000 మంది సైనికులను 10,000 మంది స్థాయికి పెంచుకోగలిగిన ఘనత శివాజీది.. సైనిక సంపత్తి ప్రాముఖ్యతను, తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్ఠమైన సైన్యంతోపాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, అధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు. వీటిలో ముఖ్యమైంది గొరిల్లా దాడి. వీటి గురించి మనం పుస్తకాల్లో చదివే ఉంటాం..

శివాజీకి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైల పుణ్య క్షేత్రంతో ఎనలేని అనుబంధముందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. శ్రీశైల భ్రమరాంబికా దేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహుకరించిందని చెబుతుంటారు. దీని వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

1677 వ సంవత్సర కాలంనాటి విషయంం ఇది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి, ఆరోజున గోల్కొండ సుల్తాన్ గా ఉన్న అబుల్ హ‌స‌న్ కుతుబ్ షా కు సాన్నిహిత్యం ఉండేది. ఆ క్రమంలో ఛత్రపతి శివాజీ కూడా గోల్కొండ కోటకు రాకపోకలు సాగిస్తూ ఉండేవారు. ఈ సమయం లోనే ఓ సారి శివాజీ శ్రీశైలాన్ని కూడా దర్శించారట. సుల్తాన్ ఆస్థానంలో మంత్రులైన అక్కన్న, మాదన్నలు కూడా శివాజీ వెంట ఉండి దర్శనం చేయించి పర్యటన పూర్తయ్యే వరకు తోడు ఉండేవాళ్లట.

ఇలా ఉండగా ఓ సారి ఛత్రపతి శివాజీ భ్రమరాంబిక ఆలయం వద్ద ఉన్న సమయంలో దేవిని చూస్తూ.. అక్కడే ఆత్మార్పణం చేసుకోవాలని భావించాడని చెబుతుంటారు. ఆ సమయంలోనే, ఆ దేవి ప్రత్యక్షమైందని, శివాజీకి ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చిందని చరిత్ర చెబుతుంది. ఈ ఖడ్గాన్ని ధరించమని, యుద్ధంలో వెనుతిరిగి చూడవని ఆ దేవి వరమిస్తుంది. నాటినుంచి, స్వతహాగా వీరుడైన ఛత్రపతి శివాజీ మరిన్ని విజయాలను అందుకున్నాడు. ఏ యుద్ధం చేసినా.. అందులో గెలుపు శివాజీదే అయ్యేది. శ్రీశైలంలో కూడా భ్రమరాంబిక దేవి శివాజీకి ఖడ్గాన్ని బహుకరిస్తున్నట్లు ఓ విగ్రహం కూడా చెక్కబడి ఉంది. మనం ఆ ఫొటోను ఇప్పటికే చూసి ఉంటాం.

ఇలా భ్రమరాంబిక దేవి శివాజీకి ఖడ్గం ఇచ్చిందనమాట..ఆ ఖడ్గంతో చత్రపతి శివాజి తిరుగులేని వీరుడిగా విజయాలు సాధించాడు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version