మనం తినే ఆహారపదార్థాలన్నీ ఎలా పెరుగుతాయి. ఏ చెట్టుకు కాస్తాయో తెలుసు. స్వీట్లు, హాట్లు, వంటలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల వంటల్లో జీడిపప్పును విరివిగా వాడుతున్నారు. అది ఎక్కడ నుంచి వచ్చిందో మాత్రం ఎవరూ చెప్పలేకున్నారు. దీని పుట్టుక ఎలా వచ్చింది. ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం..
జీడిపప్పు చెట్టు పుట్టింది దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్లో. అక్కడి నుంచి అది గోవాకి వచ్చింది. 1560లో పోర్చుగీస్ ప్రజలు ఆ చెట్టును గోవాకి తీసుకువచ్చారు. అలా అది ఆగ్నేయ ఆసియా అంతటా విస్తరించింది. ఆ తర్వాత ఆఫ్రికాకూ చేరింది. ఈ రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ జీడిపప్పును వాడుతున్నాయి. జీడిపప్పు చెట్టు ఉష్ణమండల ప్రదేశాల్లో పెరుగుతుంది. ఆ చెట్టుకు జీడిపువ్వు వచ్చాక దాని నుంచి జీడి యాపిల్ కాస్తుంది. అది కొంచెం తియ్యగా, కొంచెం వగరుగా ఉంటుంది. యాపిల్ పెద్దగా అవుతున్నప్పుడు దాని కింద జీడిపప్పు కాస్తుంది. అది కూడా పెరిగి పెద్దదవుతుంది. ఇలా జీడిపప్పు పూర్తిగా పెద్దది అయిన సమయంలో జీడి యాపిల్ చక్కటి రంగులో మంచి టేస్ట్‌తో పెద్ద పరిమాణానికి చేరుతుంది. ఆ సమయంలో జీడిపప్పును జీడి యాపిల్‌తో సహా చెట్టు నుంచి కట్ చేస్తారు. జీడి యాపిల్‌ను ఫ్రూట్ డ్రింక్ లేదా లిక్కర్ తయారీలో వాడుతారు. జీడిపప్పును వేరు చేసి అమ్ముతారు.
ఇంత ప్రాసెస్ జరుగుతంపటే అసలు జీడిపప్పు ఎలా కాస్తుందో, ఎలా పెరుగుతుందో ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. దీనికి కూడా కారణం లేకపోలేదు. జీడిపప్పు చెట్లు ఎక్కడబడితే అక్కడ ఉండవు. ఒకవేళ ఉన్నా జీడిపప్పు ఎప్పుడుబడితే అప్పుడు కాయదు. దానికీ ఓ సీజన్ ఉంటుంది. ఆ సమయంలో చూసిన వారికే దీని గురించి తెలుస్తుంది. కొల్లీన్ బల్లింగర్ అనే వ్యక్తి జీడిపప్పు, జీడి యాపిల్ ఫొటోను పోస్ట్ చేశాడు.. కొన్నేండ్ల కిందట ఈ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన చెప్పారు.