ఈపీఎఫ్ఓలో చేరాలంటే రూ.15 వేల జీతం కావాలా..?

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శాలరీ, ఉద్యోగుల సంఖ్య వంటి వాటిపైన ఆంక్షలను తొలగించాలని చూస్తోంది. అయితే స్వయం ఉపాధిని పొందే వాళ్ళు కూడ దీనిలోకి చేరేలా చేస్తోంది. వాటాదారులందరి తో ఈపీఎఫ్ఓ ప్రస్తుతం వీటి పైన చర్చిస్తోంది. ఇక పూర్తి వివరాలను చూస్తే..

ఈపీఎఫ్ఓ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు రూ.15 వేలు వస్తేనే ఈపీఎఫ్ఓలో చేరడానికి అవుతుంది. అయితే ఈ స్కీమ్ కి 20 మంది లేదా అంత కంటే ఎక్కువ సంఖ్య లో ఉద్యోగులు వున్న సంస్థల వారే చేరచ్చు. ఈ చట్టం లో మార్పులు చేయడం వలన స్వయం ఉపాధి వాళ్లకి కూడ బెనిఫిట్ కలగనుంది.

కంట్రిబ్యూషన్లు చేపట్టాలంటే గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. ఈపీఎఫ్ఓ స్కీమ్ ద్వారా సబ్‌స్క్రయిబర్లకు ప్రావిడెంట్‌ను, పెన్షన్‌ను, ఇన్సూరెన్స్ వంటి లాభాలు వస్తాయి. ఇంక్రిమెంటల్ ఆదాయం లో 15 శాతాన్ని ఈక్విటీ లో ఈపీఎఫ్ఓ పెట్టగా 25 శాతానికి పెంచాలని చూస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version