ఈ మధ్యకాలంలో ప్రతి చోట ఆధార్ కార్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. పథకాలు, సిమ్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ఎన్నో విషయాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అనే చెప్పవచ్చు. కొన్నిసార్లు నిర్లక్ష్యం వలన ఎంతో అవసరమైనటువంటి డాక్యుమెంట్ లు దొరకకుండా పోతాయి. అటువంటి సందర్భాలలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆధార్ కార్డు పోతే, కొత్త కార్డును ఎంతో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆధార్ కార్డు ఎక్కడైనా పడిపోయినప్పుడు మీకు దొరకకపోతే, ఇతరుల చేతుల్లో పడకుండా చూసుకోవాలి.
ఆధార్ కార్డులో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఉండటం వలన దీన్ని దుర్వినియోగం చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలి. కాకపోయినా, కొన్ని జాగ్రత్తలను ముందుగా తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. దీని కోసం యుఐడిఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయాలి. ఎవరికైతే మీ నెంబర్ తెలుసు అనుకుంటున్నారో, దానిని వర్చువల్ ఐడిని జనరేట్ చేయవచ్చు. ఈ విధంగా తాత్కాలికంగా ఉపయోగించవచ్చు మరియు కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా యుఐడిఏఐ వెబ్‌సైట్ ను సందర్శించాలి. అక్కడ ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మూడు ఆప్షన్స్ లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఈ విధంగా ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ బటన్ నొక్కితే, ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. దీనికి పాస్వర్డ్ కూడా ఉంటుంది. డౌన్‌లోడ్ అయిన ఆధార్ కార్డు పిడిఎఫ్ రూపంలో ఉంటుంది. దాన్ని ఓపెన్ చెయ్యడానికి పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.పేరు మరియు పుట్టిన సంవత్సరం మొదటి నాలుగు అక్షరాలను పాస్వర్డ్‌గా నమోదు చేయాలి. ఈ విధంగా ఈ ఆధార్ కార్డును వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ప్రింట్ తీసి ఉపయోగించుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్ లో పివిసి కార్డును కూడా ఆర్డర్ చేయవచ్చు. అయితే దానికి 50 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.