ఈ క్రెడిట్‌ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్‌ ఉచితం!

-

క్రెడిట్‌ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్‌ ఉచితం. అవును నిజమే సిటీబ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి మీరు 71 లీటర్ల ఉచిత పెట్రోల్‌ పొందవచ్చు. దీనికి మీ వద్ద ఇండియన్‌ ఆయిల్‌ సిటీ క్రెడిట్‌ కార్డ్‌ ఉండాలి. జాతీయ సమస్యగా మారిన పెట్రోల్‌–డీజిల్‌ ధరలు ప్రస్తుతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారతదేశంలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ఖరీదైనవి కావడానికి ప్రధాన కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు . పెట్రోల్‌కు 55.5 శాతం, డీజిల్‌కు 47.3 శాతం పన్ను విధిస్తారు. అయితే చాలా రాష్ట్రాలు పన్నులు తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్‌ రేట్లను తగ్గించాయి.

 

అయితే విషయానికి వస్తే, నిజంగానే ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా మీరు 71 లీటర్‌ ఉచిత పెట్రోల్‌–డీజిల్‌ పొందవచ్చు.ఈ ఉచిత ఇంధనాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. ఆఫర్‌తో పాటు, ఇంధనం కొనడానికి ఇది మంచి క్రెడిట్‌ కార్డు. కార్డు ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే, మీకు రివార్డ్‌ పాయింట్లు లభిస్తాయి. వాటితో మీరు ఉచితంగా పెట్రోల్‌ పొందే వీలుంది. రివార్డుల ద్వారా మీరు ఏటా 71 లీటర్ల పెట్రోల్‌–డీజిల్‌ ను ఉచితంగా పొందగలుగుతారు. రివార్డ్‌ పాయింట్లను టర్బో పాయింట్స్‌ అని కూడా అంటారు. ఈ క్రెడిట్‌ కార్డుతో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంప్‌ నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి మీకు 1% ఇంధన సర్‌చార్జ్‌ మినహాయింపు లభిస్తుంది. రివార్డ్‌ పాయింట్లు ఎలా లభిస్తాయో తెలుసుకుందాం.

ఇండియన్‌ ఆయిల్‌ పంప్‌ వద్ద రూ. 150 కు ఇంధనం కొంటే మీకు 4 టర్బో పాయింట్లు లభిస్తాయి. అదే విధంగా మీరు ఈ కార్డును సూపర్‌ మార్కెట్లలో కూడా ఉపయోగించవచ్చు. అక్కడ 150 రూపాయలు ఖర్చు చేస్తే 2 టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇతర కేటగిరీలోనూ రూ .150 ఖర్చు చేస్తే, మీకు 1 టర్బో పాయింట్‌ లభిస్తుంది. రివార్డ్‌ పాయింట్‌ను రెడీమ్‌ చేయడానికి మీరు పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈ కార్డు మిమ్మల్ని ప్రస్తుతం ఖరీదైన పెట్రోల్, డీజిల్‌ నుంచి కాపాడుతుంది.
పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజువారీగా నిర్ణయిస్తారు. మనదేశంలో ఇంధన ధరలను అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ మారక రేట్లు ముడి ధరల ఆధారంగా నిర్ణయిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version