కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..అప్పుడే జీతాల పెంపు..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పబోతుంది..త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనను విడుదల చేయనుంది. అయితే కేంద్ర బడ్జెట్ 2023 ని ప్రవేశ పెట్టిన తర్వాత డీఏ పెంపు అమలులోకి రానుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం.. కేంద్రం ఉద్యోగులకు డీఏను పెంచుతుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూన్ నెలలో డీఏను పెంచుతారు. ప్రస్తుతం ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ అంతే ఉంటే..డీఏను 3 శాతం వరకే పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అంటే.. ప్రస్తుతం ఉన్న 38 శాతం డీఏను 41 శాతంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ డీఏ 41 శాతానికి పెరిగితే.. బేసిక్ జీతం రూ.18,000 ఉన్నవాళ్లకు డీఏ నెలకు రూ.7380 కానుంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతానికి లెక్క చేస్తే.. డీఏ రూ.6840 గా ఉండనుంది. అంటే.. జీతం రూ.900 వరకు పెరగనుంది. అంటే సంవత్సరానికి పెరిగిన డీఏతో కలిపి రూ.10,800 జీతం పెరగనుంది.

గత ఏడాది యూనియన్ కేబినేట్ డీఏ, డీఆర్ ను 4 శాతానికి పెంచింది. అంటే.. 38 శాతానికి డీఏ పెరిగింది. దాని వల్ల.. కేంద్ర ప్రభుత్వానికి రూ.12,852 కోట్ల భారం పడింది. 4 శాతం డీఏ పెరగడం వల్ల.. 47.68 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.62 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. గత సంవత్సరం మార్చి 2022 లో డీఏ, డీఆర్ ను కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు 31 శాతంగా ఉన్న డీఏ.. 34 శాతానికి పెరిగింది. ఆ తర్వాత 4 శాతం పెరగడంతో 38 శాతం అయింది.ఇప్పుడు మరో 3 శాతం పెరిగితే 41శాతం పెరగనుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version