జియో వినియోగదారులకు గుడ్ న్యూస్..కొత్త ప్లాన్ ల‌ను ప్ర‌క‌టించిన జియో

ప్ర‌ముఖ టెలిక‌మ్యూనికేష‌న్ సంస్థ జియో త‌న వినియోగదారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త‌న వినియోగదారుల‌కు మ‌రింత నాణ్య‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి జియో నూత‌న ప్లాన్ ల తో ముందుకు వ‌చ్చింది. ఈ ప్లాన్ ల వివ‌రాల‌ను ఒక ప్ర‌క‌ట‌న రూపం లో విడుద‌ల చేసింది. ఈ నూత‌న ప్లాన్ ల‌తో తమ వినియోగదారుల‌కు అత్యుత్త‌మైన సేవ‌లు అందించ‌డానికి వీలు గా ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచ వ్యాప్తం గా అతి త‌క్కువ ధ‌రల‌కే నాణ్య‌మైన సేవ‌లు అందించ‌డానికి త‌మ సంస్థ ఎల్ల‌ప్పుడూ కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే త‌మ నూత‌న ప్లాన్ ల‌ను కూడా ప్ర‌క‌టించింది.

 

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ. 129 ప్లాన్ ఇప్ప‌టి నుంచి రూ. 155 కు ల‌భించ‌నుంది. ఈ ప్లాన్ ద్వారా రోజు కు 2 జీబీ డేట‌ ల‌భిస్తుంది. అలాగే అప‌రిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. దీని వ్యాలిడిటి 28 రోజులు.

అలాగే రూ . 149 ప్లాన్ ఇప్ప‌టి నుంచి రూ. 179 కి ల‌భిస్తుంది. దీని ద్వారా ప్ర‌తి రోజు కు 1 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే అప‌రిమిత కాల్స్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. వ్యాలిడిటి 24 రోజులు.

రూ. 399 ప్లాన్ ఇప్ప‌టి నుంచి రూ. 479 కి ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ప్ర‌తి రోజు 1.5 జీబీ డేటా ల‌భిస్తుంది. అప‌రిమిత కాల్స్ తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. వ్యాలిడిటి 56 రోజులు.

రూ. 444 ప్లాన్ ఇక నుంచి రూ. 533 కి లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ప్ర‌తి రోజు 2 జీబీ డేటా తో పాటు అప‌రిమిత కాల్స్ ఉంటాయి. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీ గా ఉంటాయి. వ్యాలిడిటి 56 రోజులు.

రూ. 555 ప్లాన్ ఇక నుంచి రూ. 666 కి ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ప్ర‌తి రోజు 1.5 జీబీ డేటా తో పాటు అప‌రిమిత కాల్స్ ఉంటాయి. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీ గా ఉంటాయి. వ్యాలిడిటి 84 రోజులు.

రూ. 599 ప్లాన్ ఇక నుంచి రూ. 719 కి ల‌భిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా ప్ర‌తి రోజు 2 జీబీ డేటా తో పాటు అప‌రిమిత కాల్స్ ఉంటాయి. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీ గా ఉంటాయి. వ్యాలిడిటి 84 రోజులు.

మ‌రిన్ని ప్లాన్ ల‌ను మై జియో యాప్ ద్వారా కానీ జియో అధికారిక వైబ్ సైటు నుంచి కానీ తెలుసుకోవ‌చ్చు. ఈ నూత‌న ప్లాన్ లు డిసెంబ‌ర్ 1 తేది నుంచి అమ‌లు కానున్నాయ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.