BREAKING : ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత..!

-

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. శివ శంకర్ మాస్టర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితి విషమించటంతో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో శివ శంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఇదిలా ఉండగా శివ శంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేశారు.

సాయం చేసిన వారిలో తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆట డాన్స్ షో ద్వారా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల విషయానికొస్తే ఎన్నో చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన మగధీర సినిమా కు సైతం శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగులో పలు చిత్రాల్లో సైతం ఆయన నటించి అలరించారు.

Read more RELATED
Recommended to you

Latest news