రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ సర్వీసులు ఇక నుండి పోస్ట్ ఆఫీస్ లో కూడా..!

-

ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సర్వీసులని తీసుకు వస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా మరిన్ని సదుపాయాలని ఇండియన్ రైల్వేస్ తీసుకు వస్తోంది. తాజాగా ఇండియన్ రైల్వేస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

Indian-Railways
Indian-Railways

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు టికెట్ బుకింగ్ లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలని ఈజీ చేసింది. కనుక రైలు ప్రయాణం చెయ్యాలని అనుకునే వారు రైలు టికెట్లు పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని కలిపించింది.

టికెట్ బుకింగ్‌ను నిర్వహించే సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇక నుండి టికెట్ల కోసం క్యూలైన్‌లో ఉండాల్సిన పనే లేదు. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసుకి వెళ్లి రైలు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.

ప్రయాణీకులని దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీసు ఈ సరి కొత్త నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకోవాలంటే పోస్టాఫీసుల నుంచి కూడా చేసుకో వచ్చు. దీనిని ముందుగా ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చారు. సుమారు 9147 పోస్టాఫీసులలో టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news