ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది ఈ పథకాల ద్వారా లబ్ది పొందారు..కాగా, ఈ ఏడాదికి జూన్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలుకానున్న సంగతి తెలిసిందే..మోదీ ప్రవేశ పెట్టిన పథకాలలో పీఎం జీవన్‌జ్యోతి, సురక్ష భీమా పథకాలు కూడా ఉన్నాయి.ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ రెండు పథకాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి జీవనజ్యోతి యోజన కింద 6.4 కోట్ల మంది, సురక్ష బీమా యోజన కింద 22 కోట్ల మేర చందాదారులు చేరారు. ఈ పథకాలను మొదలుపెట్టిన నాటి నుంచి ‘సురక్ష’ కింద ప్రీమియం కింద రూ.1,134 కోట్లు వసూలు చేసి, క్లెయిమ్‌ల రూపంలో రూ.2,513 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ తాజాగా వెల్లడించింది..
ఇకపోతే జీవన జ్యోతి పథకం ద్వారా .9,737 కోట్లు వసూలు చేసి రూ.14,144 కోట్ల క్లెయిమ్‌లు అందజేసినట్లు వెల్లడించింది. 2015లో ఈ రెండు పథకాలను ప్రారంభించి.. చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడేళ్లపాటు ఏటా నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియంను మాత్రం పెంచలేదని ఆర్థికశాఖ పేర్కొంది. ఇప్పుడు ప్రీమియంను పెంచడం ద్వారా ఈ పథకాల అమలుకు ప్రైవేటు కంపెనీలనూ ఆహ్వానించడానికి మెరుగ్గా ఉంటుందని తెలిపారు.దాంతో పథకాలను అందరు పొందుతారు..ఎక్కువ మందికి లబ్ది చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.