హెచ్​డీఎఫ్​సీ నుంచి గ్రీన్, సస్టెయినబుల్ డిపాజిట్లు.. ఇవి ఎలా ఉపయోగపడతాయంటే…?

-

ఇప్ప్పుడు అంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ హెచ్​డీఎఫ్​సీ (హౌజింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ గ్రీన్, సస్టెయినబుల్ డిపాజిట్స్ పేరు తో పర్యావరణాన్ని కాపాడేందుకు కొత్తగా ఈ డిపాజిట్లను తీసుకొచ్చింది.

hdfc bank
hdfc-bank

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ డిపాజిట్ల పై హెచ్‌డీఎఫ్‌సీ 6.55 శాతం వడ్డీ అందించనుంది. అయితే వీటికి మెచ్యూరిటీ సమయం కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 0.25 శాతం అదనపు వడ్డీని అందించనుంది. రూ.2 కోట్ల వరకు ఫిక్డ్స్ డిపాజిట్లకు ఇది వీలవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ కొత్త పద్దతి గురించి హెచ్​డీఎఫ్​సీ ఛైర్మన్ దీపక్ పారేఖ్ ఏం అన్నారంటే… ప్రస్తుత పరిస్థితుల్లో సస్టెయినబిలిటీ వుండకూడదు. హాని చెయ్యడం మంచిది కాదు. ప్రపంచాన్ని మార్చేందుకు మీ వంతు సాయం చేస్తూనే మీరు డబ్బును సంపాదించుకోవచ్చు అని అన్నారు. అలానే ఐక్య రాజ్య సమితి సస్టైనబుల్ గోల్స్ తో సమానంగా కొనసాగిస్తూ ఈ ఇళ్లను కట్టిస్తున్నాం అని అన్నారు.

గ్రీన్, లో కార్బన్ ఎకానమీ ఉండాలన్నదే మా ఆకాంక్ష అని కూడా తెలిపారు. అయితే ఈ ఫీచర్ భారతీయులకు, ఎన్నారైలకు అందుబాటులో ఉంటుంది. డిపాజిట్ వ్యవధి 36 నుంచి 120 నెలలు. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల కోసం హోమ్ లోన్స్ కూడా అందించనున్నారు. మహిళల పేరుపై ఇళ్లు ఉండాలనే ఆలోచనతో తక్కువ వడ్డీకే మహిళలకి రుణాలు ఇస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news