హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు… హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఇక ఇటు బిజెపి పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి ఈటల జమున ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. మొదట్లో దళిత సామాజిక వర్గానికి ఇవ్వాలని అనుకున్నా…. మళ్లీ పునరాలోచనలో పడింది కాంగ్రెస్ పార్టీ. అయితే తాజాగా… కొండా సురేఖనే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా తీసుకురావాలని అని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే… ఆమె పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో సోనియాగాంధీ ఆమోదముద్ర కూడా వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.